Stray Cow Attacks Biker in Surat

Man attacked by stray cow in surat

Surat Man Cow, Cow Attack, Surat Cow Attack, Stray Cow Attack, Stray Cow Gau Rakshak, Gau Rakshak Attack, Stray Cow Video, Stray Cow Video, Cow Attack Video, Gujarat Cow Attack, Stray Cow Attacks Man

Surat Man attacked by Stray Cow, escapes with minor injuries. Satires on Gau Rakshak in Social Media.

ITEMVIDEOS:ఆవు అతన్ని ఎందుకు పగబట్టింది?

Posted: 05/05/2017 10:51 AM IST
Man attacked by stray cow in surat

సూరత్ లో ఓ సంచలన వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. వీధుల్లో తిరిగే ఓ ఆవు ఓ వ్యక్తిపై దాడి చేసింది. కాటర్ గాం కు చెందిన ఓ డైమండ్ పాలిష్ చేసే వ్యక్తి బైక్ మీద వెళ్తుండగా ఓ ఆవు దాడి చేసింది. కొమ్ములతో కుమ్ముతూ అతన్ని తీవ్రంగా గాయపరిచింది. చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా అతన్నే టార్గెట్ చేయటం ఇక్కడ కొసమెరుపు.

ఆవు నుంచి అతన్ని రక్షించేందుకు చుట్టుపక్కల ఉన్న స్థానికులు రాళ్లు, నీళ్లు వేయటం, మరికొందరు కర్రలతో దాన్ని కుళ్లబొడవటం లాంటి పనులు చేశారు. అయితే ఆ వ్యక్తినే కార్నర్ చేసిన ఆవు.. ఆపాలని ట్రై చేసిన వాళ్లను సైతం వణికించింది. చివరకు అది కాస్త సైడ్ ఇవ్వగానే ఆ వ్యక్తి పక్కనే ఉన్న ఓ ఇంట్లోది దౌడు తీశాడు. దీంతో ఆ ఆవు మిస్సయ్యాడంటూ అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయింది.

 

ఇక తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. అక్రమంగా రవాణా చేసే ఆవులనే కాదు ఇలా అనాథ ఆవులను గోరక్షక దళాలు సంరక్షించాల్సిన బాధ్యత ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా, బహుశా అది యోగి(యూపీ సీఎం) ఆవు కాకపోవటం మూలంగానే ఎవరూ పట్టించుకోవట్లేదేమోనని కొందరు సెటైర్లు వేస్తున్నారు. గతేడాది వడోదరలో సరిగ్గా ఇలాగే బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని ఆవు పొడిచి చంపిన విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surat  Stray Cow  Attack Video  

Other Articles