Give Army free hand to respond to Pakistan: A K Antony బదులు తీర్చుకునేందుకు అర్మీకి స్వేచ్చ నివ్వండీ

Give army free hand to respond to pakistan a k antony

india soldiers, indian soldiers mutilated, indian soldiers behead, indian jawans behead, india pakistan, pakistan terrorists, indo pakistan tensions, indo-pak boarder, india pakistan tensions, india news

Former Defence Minister AK Antony asked the Modi government to give the Army the freedom to retaliate Pakistan's “barbaric” act killing and mutilating Indian soldiers on patrolling duty along the Line of Control.

బదులు తీర్చుకునేందుకు అర్మీకి స్వేచ్చ నివ్వండీ

Posted: 05/03/2017 12:50 PM IST
Give army free hand to respond to pakistan a k antony

పాకిస్థాన్ దేశంతో పాటు అదేశం పెంచిపోషిస్తున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకునేందుకు తగు స్వేచ్ఛనివ్వాలని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ డిమాండ్ చేశారు. దేశ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లపై విరుచుకుపడి వారి తలలను నరికి తీసుకువెళ్లిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మన దేశాన్ని లక్ష్యంగా చూపెట్టి.. పాకిస్థాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదం వారినే కబళిస్తుందని దుయ్యబట్టారు. దేశ రక్షణలో కేంద్రం మరింత సమర్థవంతంగా కఠినమైన విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

పాకిస్థాన్ అర్మీ కూర్రరత్వాన్ని ఖండించేందుకు కూడా తన వద్ద మాటలు లేవని అవేదన వ్యక్తం చేసిన ఆయన సరిహద్దుల్లో సైన్యానికి పూర్తి అధికారాలు ఇస్తే వారే ప్రతీకారం తీర్చుకుంటారని చెప్పారు. తమ యూపీఏ హయంలో ఇలాంటి కేవలం ఒక ఘటన మాత్రమే చోటుచేసుకోగా, బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటి ఘటనలు మూడేళ్లలో మూడు చోటుచేసుకున్నాయని ఇది దేశానికి సహేతుకం కాదని అన్నారు. ఇలాంటి ఘటనలు దేశప్రజల నైతికధైర్యాన్ని, అర్మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, మొత్తంగా సరిహద్దు భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆయన పేర్కోన్నారు.

పాకిస్థాన్ దాడులు దేశ ప్రజల ప్రతిష్టను దిగజార్చేలా వున్నాయని ఇప్పటికైనా సైన్యానికి స్వేచ్చనిస్తే వారు వారి వ్యూహాత్మక చర్యలతో పాకిస్థాన్ అర్మీపై ప్రతీకార దాడులు తీర్చుకుంటారని అంటోన అన్నారు. తాను కేంద్రాన్ని కోరుతున్నది కూడా కేవలం ఇంతేనని అన్నారు. పాకిస్థాన్ అర్మీ క్రూరమైన, అమానవీయమైన ఘటనపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన అన్నారు.

తాము అధికారంలో వున్నప్పుడు ఓక్కసారి ఇలాంటి ఘటన జరిగిన క్రమంలో తమకు బీజేపికి చెందిన మహిళా నేత ఏకంగా ప్రధాని మన్మోహన్ సింగ్ కు గాజులు పంపుతానని అఫర్ చేసిందని.. మరి ఇప్పుడు ప్రధాని మోడీకి అదే బీజేపి నేత ఎన్నిసార్లు గాజులు పంపారని కాంగ్రెస్ సీనియర నేత కపిల్ సిబాల్ ప్రశ్నించారు. ఇక ఒక తలకు బదులు పది తలలు కావాలని అప్పట్లో విఫక్ష నేత సుష్మా స్వరాజ్ కూడా డిమాండ్ చేశారని, మరి ఇప్పుడు ఎన్ని తలలను ప్రధాని మోడీ తీసుకువస్తారని ప్రశ్నించారు.

ఇక ప్రధాన అభ్యర్థిగా అప్పట్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారస్త్రాంగా చాలుకుని 56 ఇంచులు వెడల్పు ఛాతి అని వ్యాఖ్యలు చేశారన్నారు. అదే ఛాతికి కొంత స్వేచ్చను ఇస్తే చాలునని తాము కోరుతున్నామని సిబల్ అన్నారు. దేశ సరిహద్దులో పరిస్థితులు దారుణంగా వుంటే బీజేపి మాత్రం ఢిల్లీ ఎన్నికలలో గెలిచామని విజయ్ పర్వమని వేడుకలను చేసుకోవడం సిగ్గుచేటని అయన తీవ్రంగా మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian jawans  mutillated  pakistan  terrorists  indo-pak border  tensions  firing  LOC  

Other Articles