subsidised LPG price hiked by Rs 2, kerosene by 26 paisa సబ్సీడి గ్యాస్, కిరోసిన్ ధర పెంపు.. ఎల్పీజీ ధర తగ్గింపు..

Subsidised lpg gas hiked by rs 2 per cylinder and kerosene by 26 paisa per litre

LPG price, LPG and Kerosene, Indian Oil Companies, LPG price, Subsidised cooking gas, Kerosene, Oil firms, Fuel hike

State-run oil marketing firms (OMCs) hiked the prices of subsidised cooking gas (LPG) by about Rs 2 per cylinder and of kerosene by 26 paise per litre.

సబ్సీడి గ్యాస్, కిరోసిన్ ధర పెంపు.. ఎల్పీజీ ధర తగ్గింపు..

Posted: 05/02/2017 03:17 PM IST
Subsidised lpg gas hiked by rs 2 per cylinder and kerosene by 26 paisa per litre

అధికారంలోకి వచ్చే ముందు అన్ని పార్టీలు సామాన్యులను, మద్యతరగతి వర్గాల వారిని దువ్వుకోవడం పరిపాటి. కానీ అధికారంలోకి వచ్చిరాగానే ఆ వర్గాలను ముందుగా టార్గెట్ చేసి.. వారికి ఓ చేత్తో చిటికెడు ఇచ్చినట్లే ఇచ్చి. మరో చేత్తో గుప్పెడు లాగేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి వున్న పరిస్థితులకు తాజాగా ఇప్పుడన్న పరిస్థితులకు ఏ మాత్రం వ్యత్యాసం వుందో అందరకీ తెలిసిందే, ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి రాగానే అంతర్జాతీయంగా చమురు ధరల దిగివచ్చాయి.

కానీ ఆ లాభాలను మాత్రం అస్వాధించే అవకాశం ప్రభుత్వాలు కల్పించడం లేదు. ఎలాగో ప్రజలు అలావాటు పడ్డారని అనుకుంటున్నారో లేక.. ఇక ఆదాయాన్ని రాబట్టుకోవడమే మూలకారణం అని భావస్తున్నాయో తెలియదు కానీ ప్రజలపై మాత్రం భారం మోపుతున్న చమురు సంస్థలకు అమోదం తెలిపేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా అంతర్జాతీయ రేట్లకు అనుగూణంగానే ధరలను నిర్ణయం జరుగుతుందని చెబుతున్న కేంద్రం.. ఈ రెండున్నరేళ్ల కాలంలో వేసిన ఎక్సైజ్ పన్నును మాత్రం తగ్గించకుండానే మధ్యతరగతి, సామాన్య ప్రజలపై భారం మోపుతుంది.

తాజాగా, కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఇంధన సంస్థలు ఇటు గ్యాస్ సబ్సీడీ సిలిండర్ ధరను కూడా పెంచేశారు. సబ్సీడి సిలిండర్ పై రూ. 2 పెంచగా, అటు పేద ప్రజలు వినియోగించే కిరోసిన్ ధర 26 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజా ధరలతో 14.2 కేజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 440.90 నుంచి రూ. 442.90కి చేరింది. కిరోసిన్ ధర 19.55కి చేరింది. ప్రతినెల 25 పైసలు పెంచి.. కిరోసిన్ పై సబ్సిడీని తొలగించాలని ధరలను పెంచుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రేషన్ షాపుల్లో లభించే కిరోసిన్ కోటాను కూడా సగానికి తగ్గించేసింది.

పేద వర్గాలకు, అది కూడా ప్రభుత్వం ఇచ్చిన బీపీఎల్ కార్డుదారులకు మాత్రమే లభించనున్న నాలుగు లీటర్ల కిరోసిన్ ఇకపై కేవలం రెండు లీటర్లకు మాత్రమే పరిమితం కానుంది. ఇక సబ్సిడీ లేని వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.92 తగ్గించి సంపన్నవర్గాలకు చమురు సంస్థలు తీయటి కబురునందించాయి. జెట్‌ ఇంధన ధర 0.4 శాతం తగ్గించారు. చమురు ధరలు, విదేశీ మారక విలువల రేటు ఆధారంగా.. ప్రతి నెల ఒకటో తేదీన అంతర్జాతీయ చమురు ధరలకనుగుణంగా వంట గ్యాస్‌, జెట్‌ ధరలను పెంచుతున్నాయి చమురు కంపెనీలు. ఏప్రిల్ 1న సబ్సిడీ సిలిండర్ ధరను రూ. 5.57లు పెంచాయి చమురు కంపెనీలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles