curfew like situation prevails in tamil nadu తమిళనాట.. అప్రకటిత కర్ఫ్యూ.. విపక్ష నేత అరెస్టు..

Curfew like situation prevails in tamil nadu stalin arrested

Tamil nadu curfew like situation, oppsition calls for bandh, curfew like situation prevails in tamilnadu, stalin arrested, Tamil Peasants, Tamil farmers, cauvery management board, cauvery regulatory authority, Stalin, special authority zone, opposition parties, latest news

Normal life was affected in Tamil Nadu amid a shutdown called by opposition parties to press for immediate resolution of farmers' issues. DMK Working President M.K. Stalin and others were arrested.

తమిళనాట.. అప్రకటిత కర్ఫ్యూ.. విపక్ష నేత అరెస్టు..

Posted: 04/25/2017 01:52 PM IST
Curfew like situation prevails in tamil nadu stalin arrested

తమ సమస్యల పరిష్కారానికి నేరుగా హస్తిన బాట పట్టి 48 రోజుల పాటు దీక్ష చేసిన రైతులు సంఘాలకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి హామి ఇచ్చి వారి దీక్షను విరమింపజేసిన తరువాత రైతు సమస్యల తక్షణ పరిష్కారమే ధేయ్యంగా తమిళనాడులోని విఫక్షాలు ఇచ్చిన బంద్ పిలుపుకు అనూహ్య స్పందన లభిస్తోంది. బంద్ పిలుపుకు పట్టణాలు, నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పందన లభిస్తోంది.

అన్నదాతలకు మద్దతుగా విపక్షాలు ఇచ్చిన పిలుపుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు కూడా కార్యాలయాలకు సెలవు పెట్టారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కూడా తమ దుకాణాలను స్వఛ్చందంగా మూసివేశారు. అటు సినిమా థియేటర్లు, ప్రదర్శనలు, షూటింగ్ లకు కూడా సెలవు ప్రకటించిన కాలీవుడ్ రైతన్నలకు మద్దతుగా తాము వున్నామని ప్రకటించింది. అటు రవాణా సంస్థలు కూడా పలు మార్గాలలో సర్వీసులను నిలిపివేశాయి. దీంతో యావత్తు రాష్ట్రంలో జనజీవనం స్థంభించింది.

పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డీఎంకే, కాంగ్రెస్ సీపిఐ సహా పలు పార్టీలు ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, మధురై, తిరుచురాపల్లి, దిండిగల్ తదితర ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, ప్రైవేటు కంపెనీలు సహా, మాల్స్, సినిమా హాల్స్ స్వచ్ఛందంగా మూతబడటంతో రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం అలుముకుంది. కాగా, తిరువారూరులో డీఎంకే చేపట్టిన నిరసనలో పాల్గోన్న ఆ పార్టీ శాసనసభా పక్ష నేత స్టాలిన్ ను, పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles