Aadhaar to be made mandatory for marriage registration వివాహ రిజిస్ట్రేషన్లకు ఇక ‘అధార్’ తప్పనిసరి

Aadhaar to be made mandatory for marriage registration in telangana

marriage, registration, aadhaar, telangana, union government, supreme court

Telangana government to meke aadhaar card mandatory for marriage registration despite supreme court orders.

వివాహ రిజిస్ట్రేషన్లకు ఇక ‘అధార్’ తప్పనిసరి

Posted: 04/23/2017 09:58 AM IST
Aadhaar to be made mandatory for marriage registration in telangana

అధార్ ను అప్షనల్ గా మాత్రమే సరిగణలోకి తీసుకోవాలని తాము ఇచ్చిన అదేశాలను ఉల్లంఘించి తప్పని సరి చేస్తారా..? అప్షనల్ అంటే అర్థం తప్పనిసరి అనా..? అని స్వయంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన నేపథ్యాన్ని మర్చిపోయిన ప్రభుత్వాలు మరోమారు ఆధార్ ను అసుసంధానంగా చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే ఈ సారి కేంద్ర ప్రభుత్వం బదులుగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలకే ముడిపడిన ఆధార్ ఇకపై మరిన్నీంటికీ అధారంగా మారనుంది.

ఇకపై పెళ్లిళ్లకు తప్పనిసరి చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. రిజిస్ట్రేషన్ వివాహాల్లో ఆధార్‌ను తప్పనిసరి చేయాలని తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. వివాహాలను డిజిటలైజ్ చేయడంలో భాగంగా వధూవరుల వివరాలతోపాటు వారి ఆధార్ నంబర్లు, వేలిముద్రలు సేకరించాలని నిర్ణయించింది. దీని వల్ల రెండో పెళ్లిళ్లకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. అయితే ఇది కేవలం రిజిస్ట్రేషన్ పెళ్లిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆయా మతాచారాల ప్రకారం బయట జరుపుకునే వివాహాలకు ఇది వర్తించదు.

ప్రస్తుతం తెలంగాణలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెళ్లిళ్లను రికార్డ్ చేస్తున్నారు. ఈ కార్యాలయాల్లో రెండు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. వధూవరులు వచ్చి పెళ్లి చేయాలని కోరితే నెల రోజుల్లో వారికి వివాహం జరిపించి ధ్రువపత్రం ఇవ్వడం అందులో మొదటిది కాగా, బయట పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం రెండోది. ఈ వ్యవహారమంతా మాన్యువల్‌గా జరుగుతోంది. వారు చేసుకున్న దరఖాస్తులను తీసుకుని రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు.

దీంతో ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే పట్టుకోవడం కష్టంగా మారుతోంది. కొందరు రెండుమూడు సార్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా పట్టుబడడం లేదు. ఈ కారణంగానే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సమయంలో వధూవరుల నుంచి ఆధార్ నంబర్, వారి ఫొటోలు, వేలిముద్రలు అన్నీ సేకరించి ఆన్‌లైన్‌లో భద్రపరుస్తారు. ఇలా చేయడం వల్ల రెండో పెళ్లిళ్లకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. తొలుత ఈ విధానాన్ని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marriage  registration  aadhaar  telangana  union government  supreme court  

Other Articles