పరువు తీసిన క్యాబ్ డ్రైవర్.. పర్యాటకురాలితో వికృత చేష్టలు cab driver misbehaviour with tourist lands him behind the bars

Cab driver misbehaviour with tourist lands him behind the bars

cab driver misbehaviour, cab driver she teams, banglore tourist cab driver, bengaluru tourist cab driver, mohammad saleem, grotesque activity, tourist she teams, bang lore tourist she teams, swathi lakra, pahadiSharif, crime

Bangalore tourist who visited telangana noted she teams number and complained about the grotesque activity she faced by the cab driver in Hyderabad

పరువు తీసిన క్యాబ్ డ్రైవర్.. పర్యాటకురాలితో వికృత చేష్టలు

Posted: 04/19/2017 03:01 PM IST
Cab driver misbehaviour with tourist lands him behind the bars

పొరుగు రాష్ట్రం నుంచి నగర పర్యటనకు వచ్చిన ఓ పర్యాటకురాలి ముందు నగరంపై వున్న అభిమానం పోవడంతో పాటు ప్రపంచ పటంలో నిలిచే నగరమని గర్వంగా చెప్పుకుంటున్నా.. పరువు మాత్రం పోయింది. అమెకు ఓ క్యాబ్ డ్రైవర్ అమె పట్ల వికృతంగా ప్రపవర్తించి.. మరీ అమెకు చేదు అనుభవం ఎదురైయ్యేలా చేశాడు. అమెతో పాటు అమె తల్లిదండ్రులు.. బంధువులు వున్నా.. వాడి అగడాలు మాత్రం అగలేదు. పరాయి రాష్ట్రం నుంచి వచ్చారు. తానెమన్నా పడతారు అనుకున్నాడు కాబోలు.. వక్రబుద్దితో వ్యవహరించాడు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీపి (క్రైం) స్వాతి లక్రా.. నగరం పరువు తీస్తే.. ఊరుకుంటామా..? తాట తీస్తాం అన్నట్లు నిందితుడికి హెచ్చరికలు ఇచ్చారు. అతిధులను అప్యాయతతో పలుకరించాలని, వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని.. అమె సూచించారు.  ఇళ్ల వద్ద పోరుగింటివారితో వ్యవహరించినట్లు దేశంలోని ఇతర రాష్ట్ర పర్యాటకులతో మెలగాలని, ఇక పరదేశ పర్యటకులు మన అతిధులని వారితో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అమె ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్లకు సూచించారు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన ఓ మహిళ గత వారం కుటుంబీకులతో నగర పర్యటనకు వచ్చారు. సిటీకి చెందిన ఓ ట్రావెల్‌ ఏజెన్సీ నుంచి క్యాబ్‌ను ఎంగేజ్‌ చేసుకున్నారు. ఈ వాహనానికి పహాడీషరీఫ్‌కు చెందిన నలభై ఏళ్ల మహ్మద్‌ సలీం డ్రైవర్‌గా వచ్చాడు. పర్యటన అనంతరం తిరిగి వెళ్లేందుకు అంతా రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. బాధితురాలు డ్రైవర్‌ పక్క సీటులో కూర్చోగా... కుటుంబీకులు వెనుక సీట్లో కూర్చున్నారు. అదే అదనుగా భావించిన సలీం.. అమెను లైంగికంగా వేదించాడు.

రైల్వే స్టేషన్ కు వెళ్తున్న దారిలో డ్రైవర్‌ సలీం పర్యాటకురాలిపై వికృతంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. తీవ్ర జుగుప్సకు లోనైన బాధితురాలు కారు ఆపమని చెప్తున్నా పెడచెవిన పెట్టి అలాగే కారును నడిపించాడు. సలీం వికృత చేష్టలు శృతిమించుతున్న తరుణంలో సదరు మహిళ చివరకు బలవంతంగా కారు ఆపించి కిందికి దిగారు. తన పట్ల అనుచితంగా వ్వవహరించిన డ్రైవర్ గురించి తన తండ్రితో పాటు బంధువుకు విషయం చెప్పారు. వారు ప్రశ్నిస్తుండగానే.. లగేజ్‌ను నడిరోడ్డుపై పడేసిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి ఉడాయించాడు.

దీనిపై బాధితురాలు అప్పుడే ట్రావెల్స్‌ నిర్వాహకులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు సలీంపై ఎలాంటి చర్యలు తీసుకునేట్లు లేరన్న అనుమానం అమెలో ఎక్కడో వుండింది. దీంతో క్యాబ్ డ్రైవర్ కు తప్పక తగిన శిక్ష పడాలని భావించిన మహిళ.. పోలీసులకు పిర్యాదు చేయాలని భావించారు. కాగా, రైలు మిస్ అవుతుందన్న..  సమయాభావంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బెంగళూరు చేరుకున్న తర్వాత షీ–టీమ్స్ గురించి తెలుసుకున్న అమె.. వారికి వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cab driver  mohammad saleem  grotesque activity  tourist  she teams  swathi lakra  pahadi Sharif  crime  

Other Articles