చిన్నబాబు నాలుక మళ్లీ జారిందా..? లేక అది అంతేనా.? Naidu's son says death anniversary on Ambedkar Jayanti

Nara lokesh greeted audience on babasaheb s death anniversary on jayanti

Nara Lokesh, AP minister, Chandrababu Naidu, Ambedkar Jayanti, death anniversary, MLC oath, Andhra Pradesh, Nara Lokesh tongue slip

The 126th birth anniversary of BR Ambedkar, Andhra Pradesh Panchayat Raj and Information technology Minister Nara Lokesh used the Telugu word "Vardhanthi" (death anniversary) while greeting a gathering in Vijayawada.

ITEMVIDEOS: చిన్నబాబు నాలుక మళ్లీ జారిందా..? లేక అది అంతేనా.?

Posted: 04/15/2017 06:05 PM IST
Nara lokesh greeted audience on babasaheb s death anniversary on jayanti

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరీముఖ్యంగా టీడీపీ శ్రేణులకు చిన్నబాబుగా సుపరిచితులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్.. వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారింది. నెట్ జనులు లోకేష్ వీడియోను తెగ షేర్ చేసుకుంటు నవ్వును అపుకోలేకపోతున్నారు. అదేంటి అంతలా నవ్వులు పూయించే వీడియో ఏంటా అని అలోచిస్తున్నారా..? అదేనండీ చిన్నాబాబు నారా లోకేష్ మళ్లీ నాలుక జారిన వీడియో. అవునండీ కొద్ది రోజుల వ్యవధిలోనే చిన్నాబాబు రెండు పర్యాయాలు నాలుక జారారు.

బంధుప్రీతికి, కుటుంబసభ్యుల పెత్తనానికి దూరంగా తమ పార్టీ వుంటుందని చంద్రబాబు పదేపదే చెప్పినా.. ఆయన ప్రభుత్వంలోనే ఇటీవల శాసనమండలి సభ్యుడిగా, ఆ తరువత  అంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్‌ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఇటీవల మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలోనూ లోకేష్ బాబు టంగ్ స్లిప్ అయిన వీడియో వైరల్ అయ్యింది. శ్రద్ధా పూర్వకానికి బదులు శ్రద్ధాంజలి అని పలికి లోకేష్ బాబు తన ప్రమాణ వీకార వీడియోను వైరల్ చేశారు.

ఇక తాజాగా మళ్లీ అదే ఒరవడితో వైరల్ అయ్యాడు ఈ మంత్రివర్యులు. అంబేడ్కర్ 126వ జయంతిని పొరపాటుగా ప్రస్తావించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాజధాని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సభకు హాజరయ్యారు. ఆయన ప్రసంగం జోహార్ బీఆర్ అంబేడ్కర్ అని నినాదంతో ప్రారంభమైంది. అనంతరం 126వ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు అని చెప్పారు. ఆ తర్వాత ఆయన నాలుక్కరుచుకుని.. సారీ.. జయంతి అని సర్దుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles