బీజేపి సర్కార్ నిర్ణయం.. ప్రజలపై మరింత పన్ను భారం.. Service tax may move up from 15% to 18% under GST

Service tax may move up from 15 to 18 under gst revenue secretary hasmukh adhia

Service tax, revenue secretary, Hasmukh Adhia, GST Council, GST, service tax hike, 15% to 18% hike, BJP Government, Union government, PM Modi

Services sector is likely to attract a higher tax rate of 18 per cent from the current 15 per cent under the Goods and Services Tax (GST) regime

బీజేపి సర్కార్ నిర్ణయం.. ప్రజలపై మరింత పన్ను భారం..

Posted: 04/14/2017 08:54 PM IST
Service tax may move up from 15 to 18 under gst revenue secretary hasmukh adhia

దేశ ప్రజలపై ఇప్పటికే స్వచ్చా భారత్, మహిళా శిశు కల్యాణ్ పథకాల పేరుతో 14 శాతం మేర వున్న పన్నును కాస్తా 15 శాతానికి పెంచుతూ భారాన్ని వేసిన కేంద్ర.. ఇకపై మరింత పన్ను భారాన్ని వేయాలని భావిస్తుందా..? పన్నుపోటుతో ప్రజల నడ్డీ విరిచేందుకు సిద్దమైందా..? అంటే అవుననే సమాధానాలే వినపిస్తున్నాయి. మరో మూడు మాసాల్లో అమలుకు నోచుకోన్న కొత్త పన్ను విధానం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)తో పన్నుల బాదుడు కేంద్రం సిద్దమైందని తెలుస్తుంది.

చిటికెడు తాయిలం ఇచ్చి.. గుప్పెడు వస్తువులపై పన్నుల భారం పెంచేందుకు కేంద్రం సిద్దమైందన్న వార్తులు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. వీలైనన్ని ఎక్కువ వస్తువులపై ఏదో ఒక రూపంలో ప్రభుత్వం పన్నుల భారం మోపేందుకు రెడీ అవుతుందని, దీంతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టబోతోందని జాతీయ పత్రికలు కథనాలను ప్రచురిస్తున్నాయి. వస్తు సేవా పన్నులో ధరల పెంపు జాబితాలో సినిమా టిక్కెట్లు, హోటల్‌ బిల్లు, టెలిఫోన్‌ బిల్లులు, కేబుల్‌ టీవీ బిల్లు, బీమా పాలసీలపై ప్రీమియం చెల్లింపు, బ్యూటీపార్లర్‌, ఎటిఎం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై చెల్లింపులు, కొరియర్‌ సేవలు, లాండ్రీ సర్వీసులతో సహా దాదాపు 100 రకాల నిత్య వినియోగ సేవలు మరింత ప్రియం కాబోతున్నాయి.

ఈ మేరకు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా సంకేతాలు ఇచ్చారు. సర్వీస్‌ టాక్స్‌పై ఆయన వెల్లడించిన విషయాలు వస్తువుల పన్ను భారాన్ని పెంచుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం 15 శాతంగా ఉన్న సర్వీస్‌ టాక్స్‌ను మరో మూడు శాతం పెంచి జిఎస్‌టి హయాంలో 18 శాతంగా చేసే యోచన ఉందని అధియా వ్యాఖ్యానించారు. వచ్చే నెల 18-19 తేదీల్లో శ్రీనగర్‌లో జరిగే సమావేశంలో జిఎ‌సటి కౌన్సిల్‌ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 
ఏటా రూ.20 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యాపారులు జిఎస్‌టి కింద పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరంలేదని అధియా చెప్పారు. దీంతో వీరు ఎలాంటి సర్వీస్‌ టాక్స్‌ చెల్లించాల్సిన అవసరంలేదని వివరణ ఇచ్చారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం వార్షిక టర్నోవర్‌ రూ.10 లక్షలు దాటే వ్యాపారులు అందరూ సర్వీస్‌ టాక్స్‌ చెల్లించాలి. జిఎ్‌సటి కింద ఈ మినహాయింపు పరిమితి రూ.20 లక్షలకు పెరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Service tax  revenue secretary  Hasmukh Adhia  GST Council  GST  service tax hike  PM Modi  

Other Articles