రవిశాస్త్రీపై పరోక్షంగా మండిపడిన బీసీసీఐ BCCI Not Happy With Ravi Shastri 'Peanuts' comments

Bcci not happy with ravi shastri for referring to indian players pay hikes as peanuts

BCCI, vinod roy, TeamIndia, Indian cricket team, Virat Kohli, Anil kumble, Ravi Shastri, 'Peanuts' comments, cricket

The chief of BCCI's Committee of Administrators Vinod Rai is unhappy with Ravi Shastri over his 'peanuts' jibe at the pay hike given to Indian cricketers.

రవిశాస్త్రీపై పరోక్షంగా మండిపడిన బీసీసీఐ

Posted: 04/13/2017 06:59 PM IST
Bcci not happy with ravi shastri for referring to indian players pay hikes as peanuts

టీమిండియా క్రికెటర్ల జీత భత్యాల విషయంలో జట్టు సభ్యులతో పాటు సీనియర్ల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎట్టకేలకు ఈ అంశమై స్పందించింది. ఈ విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదని తేల్చిచెప్పింది. భారత క్రికెట్ ఆటగాళ్ల తాజా కాంట్రాక్ట్ వేతనాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం లేవంటూ ధ్వజమెత్తిన భారత క్రికెట్ జట్టు మాజీ డైరక్టర్ రవిశాస్త్రిపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు ఎవరి సలహాలు అవసరం లేదని రవిశాస్త్రి జోక్యాన్ని తప్పబట్టారు బీసీసీఐ పరిపాలన కమిటీ సీఈవో వినోద్ రాయ్.

క్రికెటర్ల వార్షిక వేతనాల విషయంలో తాము చాలా క్లియర్ గా ఉన్నామని స్పష్టం చేసిన బిసిసిఐ పరిపాలన కమిటీ సీఈవో వినోద్ రాయ్.. శాలరీల పెంపుపై భారత ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఇప్పటికే ఒక నివేదిక అందజేశారని తెలిపారు. దీంతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో ఇప్పటికే సమావేశమై ఈ అంశంపై చర్చించామని చెప్పారు. వేతనాల పెంపుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles