బికినీ ఆ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కనులకు ఇంపుగా సొంపుగా ఉండే రెండు అంగుళాల రెండు గుడ్డల కోసం ఎగబడిపోయే వారు ఎందరో. అంతేందుకు సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ బికినీ అని చెబితే చాలూ థియేటర్లకు క్యూ కట్టే జనాలున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఓ విమానంలో టూ పీస్ లో ఎయిర్ హోస్టెస్ ఉంటే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇప్పడు అక్కడ ఇలాంటి సీనే దర్శనమిస్తోంది.
వియత్నాంకు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ వియెట్ జెట్ ఈ వినూత్న ఆలోచన చేసింది. ఇతర ఎయిర్ లైన్స్ కు భిన్నంగా తమ విమానాల్లో సేవలందించే ఎయిర్ హోస్టెస్ లతో బికినీలు వేయించింది. అయితే ఈ ఆదేశాలు కేవలం బీచ్ లకు వెళ్లే విమానాలలో పనిచేసే సిబ్బందికి మాత్రమే వర్తిస్తుందంట. దీంతో ఇప్పడు ఈ విమానాల్లో ఎయిర్ హోస్టెస్ లు టూపీస్ బికినీల్లో దర్శనమిస్తున్నారు. ఇంకేం వాళ్ల లక్ష్యం నెరవేరింది. ఊహించని రేంజ్ లో ప్రయాణికులు ఈ ఎయిర్ లైన్స్ కు క్యూ కట్టేస్తున్నారు. అంతేనా ముద్దుగా బికినీ ఎయిర్ లైన్స్ అంటూ పేరు కూడా పెట్టేశారు.
2011లో ఈ ఎయిర్ లైన్స్ యజమాని గుయెన్ థీ పుహోంగ థావో ఏకంగా ఎయిర్ హోస్టెస్ లతో ఫ్యాషన్ షూట్ చేయటమే కాకుండా, విమానంలో బికినీ షో చేయించాడు కూడా. అయితే డ్రెస్ కోడ్ ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ విమాన సంస్థల బోర్డు 2012లో వియత జెట్ ఎయిర్ లైన్స్ పై జరిమానా విధించిందింది లేండి. మళ్లీ ఆరేళ్ల తర్వాత అదే ఆలోచనను అమలు చేశారు. అయితే మొదట్లో పేరు ప్రతిష్టలు దెబ్బతింటుందని, ప్రయాణికులు తగ్గిపోతారని అంతా భావించగా, సీన్ రివర్స్ అయ్యి ఇలా సీట్లు ఫుల్ అయిపోతున్నాయి. అయితే దీని ద్వారా ప్రభుత్వ ఎయిర్ లైన్స్ కు దెబ్బ పడిపోతుందని భావిస్తున్న పర్యాటక శాఖకు దానిపై నియంత్రణలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more