విడాకులు ఇచ్చిన తన భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలని రగలిపోయిన ఓ భర్త.. అమెను కోట్టకుండా, తిట్టకుండా.. అసలు తాను సీన్ లోకే రాకుండా జరిమానాలతో కసితీర్చుకున్న భర్త ఘటనను మర్చిపోకముందే.. ఇదే తరహాలో వ్యవహరించిన మరో భర్త మొండితనం కూడా వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన ఓ భర్త.. తన మాటను కాదంటుందని అమెపై ప్రతీకారం తీర్చుకునేందుకు వేసిన వెదవ ఐడియా కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రష్యాలోని మాస్కోలో వెనియ్ అనే సూపర్ మార్కెట్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించడంతో దానికి ముచ్చటపడిన భార్య.. తాను ఆ ఆఫర్ లో పాల్గోంటున్నానని భర్తను అడిగింది. దానికి భర్త ససేమిరా అన్నాడు. ఇంతకీ ఆ ప్రకటన ఏంటో తెలుసా..? ఎవరైతే తమ ఇంటి పేరు మార్చుకుని, అధికారికంగా తమ సూపర్ మార్కెట్ పేరు పెట్టుకుంటారో వారికి ప్రతినెలా 50,000 రూబెల్స్ (మన కరెన్సీలో 56,000 రూపాయలు) ఇస్తామని ప్రకటించింది. ప్రతీ నెల కష్టపడకుండానే వస్తాయంటే ఎవరు మాత్రం వద్దంటారు. అంతే ఆ భార్య కూడా భర్త వద్దకెళ్లి తాను కూడా అందులో పాల్గోంటానని చెప్పింది.
అయితే పెద్దగా లౌక్యం లేనిది కాబోలు అందుకనే భర్తకు ఉన్న విషయం మొత్తం చెప్పింది. తాను ఆ ఆఫర్ ను తీసుకుంటానని కాకుండా.. తన ఇంటిపేరు మార్చుకుంటానని చెప్పింది. అంతే ఇది విన్న భర్త అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, మనస్పర్థలు, అభిప్రాయ బేధాలు అన్ని వచ్చి చేరాయి. అంతేకాదు.. ఏకంగా భర్తనే వద్దనుకునే స్థాయికి వెళ్లింది ఆ భార్యమణి. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంతో ఇక కలిసి ఉండాల్సిన అవసరం లేదంటూ కూడా భార్య దురుసుగా సమాధానం చెప్పింది.
డబ్బుల కోసం ఇంటిపేరును కూడా తృణప్రాయంగా మార్చుకోగల తన భార్య మనస్తత్వంపై లోలోన రగిలిపోయిన భర్త.. అమెకు బుద్ది చెప్పాలనుకున్నాడు. అమె అన్న ప్రతీ ఒక్క మాట గుర్తుకు వచ్చి.. కుతకుతలాడిపోయాడు. అమెకు అమితంగా ఇష్టమైన కారుతో అమెకు బుద్ది చెప్పాలనుకున్నాడు. ఏం చేశాడో తెలుసా..? ఒక కాంక్రీటు సిమెంటు ట్రక్కును రప్పించి, తన భార్య కారులో డ్రైవింగ్ సీటుతో పాటుగా.. స్టీరింగ్ వరకు నిండుకునేలా.. నిండా కాంక్రీట్ ను నింపేశాడు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.. అది కాస్తా వైరల్ అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more