అమెరికాలో మరో భారతీయ యువకుడి హత్య.. 26-year-old Indian shot dead by armed robbers at gas station

26 year old indian shot dead by armed robbers at gas station

vikram jaryal, indian man shot dead in us, vikram jaryal shot dead, vikram jaryal us, indian attacked in us, hate attacks, hate attacks on indians, hate attacks in united states, hate attacks on indians in us, india news, latest news

Vikram Jaryal, who was working as a clerk in a store at AM-PM Gas Station in Washington, was shot dead by masked robbers.

అమెరికాలో మరో భారతీయ యువకుడి హత్య..

Posted: 04/08/2017 09:11 AM IST
26 year old indian shot dead by armed robbers at gas station

అమెరికాలో మరో దారుణం జరిగింది. భారతీయ యువకుడిపై అక్కడి అగంతకులు కాల్పులకు తెగబడ్డారు. డొనాల్ట్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి  భారతీయులుపై వరుస దాడులు, హత్యలు ఆడగం లేదు. సాఫ్ట్ వేర్ ఇంజనీరు కూచిబోట్ల శ్రీనివాస్ హత్యోందంతం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి అనేక మంది భారతీయులు జాత్యహంకార దాడులకు గురవుతున్నారు. ఈ క్రమంలో పలువురు భారతీయులు జాతివిద్వేషాలకు అసువులు బాయగా, మరికోందరు దాడులకు గురూ ప్రాణాలతో మిగిలారు.

తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ లో ఓ భారతీయ యువకుడు  కాల్పులకు బలయ్యాడు. పంజాబ్‌కు చెందిన విక్రమ్ జర్యాల్ (26) అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం.. యకిమా నగరంలో హత్యకు గురయ్యాడు. యువకుడు పనిచేస్తున్న ఏఎం-పీఎం గ్యాస్ స్టేషన్‌కు తుపాకులతో వచ్చిన ముసుగు దొంగలు విక్రమ్ ను డబ్బు డిమాండ్ చేశారు. దుండగుల బెదిరింపులు అక్కడ సాధారణం కావడంతో.. కౌంటర్‌లో ఉన్న సొమ్మును తీసుకొచ్చి ఇచ్చాక ఆ డబ్బును తీసుకున్న దుండగులలో ఒకరు.. విక్రమ్‌పై కాల్పులు జరిపి పారిపోయారు.

తీవ్ర గాయాలపాలైన విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పోందుతూ ఆయన కొద్దిసేపటికే మరణించాడు. అయితే ఘటనాస్థలానికి చేరుకున్న తమకు ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పిన విక్రమ్.. కొద్దిసేవపటికే మరణించాడం బాధకరమని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. భారత్ లోని పంజాబ్ రాష్ట్రం హోషియాపూర్ జిల్లాకు చెందిన విక్రమ్.. నెల రోజుల క్రితమే అమెరికాకు వెళ్లాడని అతని పెద్ద సోదరుడు తెలిపారు.

కాగా ఇది జాత్యహంకార దాడేనని అమెరికాలోని భారతీయులు ఆరోపిస్తున్నారు. విక్రమ్ హత్య విషయాన్ని తెలుసుకున్న భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. విక్రమ్ హత్యను తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో భాదిత కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తమ సోదరుడి బౌతికఖాయాన్ని స్వగ్రామానికి తీసుకురావడంలో సహకరించాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. విక్రమ్ మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Vikram Jaryal  Indian man shot  robbery  Vikram Jaryal  Yakima city  US news  

Other Articles