కేంద్రం అదేశాలు.. ఇక రవింద్ర గైక్వాడ్ ఎగరావచ్చు..! regrets-accepted,-shiv-sena-mp-ravindra-gaikwad-can-fly-again,-ban-ends

Regrets accepted shiv sena mp ravindra gaikwad can fly again ban ends

Shiv sena, Shiv sena MP, Anant Geete, Aviation Minister Ashok Gajapathi Raju, TDP MPs, Rajnath singh, Sushma swaraj, Ahluwalia, Ravindra Gaikwad, Gaekwad, Gaekwad flight ban, Shiv sena Ravindra Gaikwad, india news, ravindra gaikwad, shiv sena, air india, shiv sena mp, gaikwad air india, gaikwad shiv sena, lok sabha, parliament, Ravindra Gaikwad in lok sabha, all about Ravindra Gaikwad

Ravindra Gaikwad, Shiv Sena parliamentarian, can now return to using planes. Air India has lifted its ban on him, imposed last month after the politician thrashed an Air India manager

కేంద్రం అదేశాలు.. ఇక రవింద్ర గైక్వాడ్ ఎగరావచ్చు..!

Posted: 04/07/2017 03:20 PM IST
Regrets accepted shiv sena mp ravindra gaikwad can fly again ban ends

విమానయాన సంస్థ అధికారిపై అవమానకర రీతిలో ప్రవర్తించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై నిషేధం ఎత్తివేశారు. తాజాగా కేంద్రం జారీ చేసిన అదేశాల నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు ఈ మేరకు ఎయిరిండియాకు లిఖితపూర్వకంగా లేఖ రాశారు. రవీంద్ర గైక్వాడ్ పశ్చాతాపం వ్యక్తం చేసిన నేపథ్యంలో దానిన పరిగణలోకి తీసుకన్న కేంద్రం అతనిపై నిషేదాన్ని ఎత్తివేయాలని సూచించిందని.. దీంతో అతనిపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని అయన లేఖలో పేర్కోన్నారు.

దీంతో రవీంద్ర గైక్వాడ్ పై విధించిన నిషేధాన్ని ఎయిరిండియా ఎత్తివేసింది. దీంతో గత కొన్ని రోజులుగా బ్లాక్ లిస్టులో వున్న గైక్వాడ్ ఇకపై తాను గతంలో చెప్పినట్లుగానే యధేశ్చగా విమానయానం చేస్తారు. అయితే శివసేన ఎంపీ రాత పూర్వకంగా క్షమాపణలు చెబితే ఆయనపై విధించిన నిషేధాన్నిఎత్తి వేస్తామని ‘ఎయిర్ ఇండియా’ వర్గాలు చెప్పినా.. కేంద్రం తాజాగా జారీ చేసిన అదేశాలతో వారు ఈ పార్లమెంటు సభ్యుడిపై వున్న నిషేదాలను తొలగించారు. ఇక ఆయన మళ్లీ విమానయానం చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

అయితే రవీంద్ర గైక్వాడ్ పై నిషేధం అంశంలో నిన్న లోక్ సభలో ఆ పార్టీ ఎంపీలు సృష్టించిన వీరంగాన్ని పెద్దది చేయకుండా ఆయన ఇచ్చిన క్షమాపణ పత్రాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఇకపై ఆయనపైనున్న నిషేధాన్ని తొలగించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రిని అదేశించింది. అయితే ఎంపీ మాత్రం ఓ మెట్టు దిగి క్షమాపణలు కోరుతూ ఎయిరిండియాకు ఓ లేఖ రాశారు. లేఖలో ఎయిర్ ఇండియా అధికారిపై దాడికి పాల్పడిన విషయమై తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shiv sena  ashok gajapathi raju  ravindra gaikwad  air india  flying ban  center  

Other Articles