నారాయణ కాలేజీ భవనం.. పేకమేడలా కుప్పకూలింది.. Narayana College Building Collapse In Vijayawada

Narayana college building collapse in vijayawada

Narayana College Building Collapse In Vijayawada, Narayana College Building Collapse, Narayana College Building bandar road, Narayana College, Narayana, College, Building, bandar road, vijayawada

Narayana College Building Collapsed In Bandar Road of Vijayawada while road extension works are in progress. The proclainer driver and two labours escaped safely from the spot.

నారాయణ కాలేజీ భవనం.. పేకమేడలా కుప్పకూలింది..

Posted: 04/06/2017 05:39 PM IST
Narayana college building collapse in vijayawada

విజయవాడలో పెను ప్రమాదం తప్పింది. నారాయణ కాలేజీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. బందరు రోడ్డు విస్తరణ పనులలో భాగంగా ప్రోక్లెయినర్ తో నిర్మాణాలను కూలుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు విస్తర్ణం పనులను వేగవంతం చేయాలని అదేశాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ప్రోక్లెయినర్ సాయంతో బందరు రోడ్డు విస్తరణకు అడ్డుగా వున్న ఈడుపుగల్లుతోని నిర్మాణాలను కూల్చివేయించారు అధికారులు. ఇందులో భాగంగా బందరు రోడ్డులోని నారాయణ కాలేజీ భవనాన్ని కూల్చుతుండగా, ఆ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.

భవనం ఏకంగా ప్రోక్లెయినర్ పై పడటంతో.. దాని చెంతనే వున్న కూలిలతో పాటు డ్రైవర్ కూడా సురక్షితంగా బయటపడ్డారు. అయితే భవనం కుప్పకూలగానే భవన శిధిలాల కింద పలువురు కూలీలు చిక్కుకుని వుంటారని అంతా భావించారు. అయితే ప్రోక్లెయినర్ డ్రైవర్ సహా ఇద్దరు కూలీలు క్షేమంగా బయటపడటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, కాలేజీకి సెలవులు ఇచ్చిన క్రమంలో ఈ ఘటన జరగడం పట్ల కూడా పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే వేలకు వేల రూపాయలు ఫీజలు తీసుకుంటున్న కాలేజీ యాజమాన్యాలు ఇంత లోపభూయిష్టంగా కాలేజీ భవనాలను నిర్మించడమేంటన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. వేసవి సెలవు వచ్చిన తరుణలో ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి ఎలాంటి విషాదం చోటుచేసుకోలేదని, అదే కాలేజీలు సక్రమంగా సాగుతున్న క్రమంలో ఇలాంటి ఘటనలు జరిగివుంటే పరిస్థితి ఎలా వుండేదని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narayana college  college building  collapse  bandar road  vijayawada  

Other Articles