పార్లమెంటులో ఎయిరిండియా వ్యతిరేక నినాదాలు.. Ravindra Gaikwad takes chartered plane to attend parliament

Shiv sena mps raise anti air india slogans in parliament

Shiv sena, Shiv sena MP, Ravindra Gaikwad, Gaekwad, Gaekwad flight ban, Shiv sena Ravindra Gaikwad, india news, ravindra gaikwad, shiv sena, air india, shiv sena mp, gaikwad air india, gaikwad shiv sena, lok sabha, parliament, Ravindra Gaikwad in lok sabha, all about Ravindra Gaikwad

Shiv Sena MPs raised anti-Air India slogans in Lok Sabha even as Speaker Sumitra Mahajan allowed controversial lawmaker Ravindra Gaikwad to make a statement in the House.

అద్దె విమానంలో పార్లమెంటుకు.. దాడి అబద్దమన్న రవీంద్ర గైక్వాడ్

Posted: 04/06/2017 11:44 AM IST
Shiv sena mps raise anti air india slogans in parliament

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. ఎయిరిండియా మేనేజరుపై దాడి నేపథ్యంలో తనపై కేసు పెడతామన్నా బెట్టు వీడని ఎంపీ.. అవును ఒక్కటి కాదు పాతికసార్లు చెప్పుతో కొట్టాను.. నాపై ఇప్పటికే అనేక కేసులు వున్నాయి. అందులో ఇది ఒకటి అవుతుందంటూ.. రేపో, మాపో రిటైర్ కాబోతున్న వ్యక్తిపై ప్రతాపాన్ని చూపిన గైక్వాడ్.. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిపై దాడి చేయలేదని అన్నారు. ఎయిరిండియా సిబ్బందే తనను అవమానపర్చినట్లు పార్లమెంటులో చెప్పుకోచ్చారు.

ఎయిరిండియా సహా పలు ప్రైవేటు విమాన సంస్థలు కూడా రవింద్ర గైక్వాడ్ చర్యను ఖండిస్తూ.. అతను విమానంలో ప్రయాణించేందుకు వీలు కల్పించకుండా అతనిపై బ్యాన్ విధించింది. దీంతో స్పెషల్ చార్టెర్డ్ ప్లైట్ లో పూనే నుంచి ఢిలీకి వచ్చి ఆయన పార్లమెంట్ సెషన్ కు హాజరయ్యారు. అప్పటికే రవీంద్ర గైక్వాడ్ ను ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణించే విషయమై, అతనిపై బ్యాన్ విధించడంపై పార్లమెంట్ లో శివసేన ఎంపీలు నిరసన తెలిపారు. దీనిపై వాయిదా తీర్మానం కోరారు.

తమ పార్లమెంటు సభ్యుడు గైక్వాడ్ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావడానికి స్పెషల్ చార్టర్డ్ ప్లేన్ తీసుకొని రావాల్సి వచ్చిందని.. దీనిపై చర్చ జరగాలని శివసేన డిమాండ్ చేశారు. దీంతో గైక్వాడ్ లోక్ సభలో తన వివరణ ఇచ్చేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించారు. ఈ సందర్భంగా వివరణ ఇచ్చిన గైక్వాడ్ తాను ఎయిరిండియా విమాన సిబ్బంది పట్లు అమార్యాదగా వ్యవవహరించలేదన్నారు. వారే తనను అవమానించారని పేర్కోన్నారు.

తాను నరేంద్రమోడీగా భావిస్తున్నారా..? అంటూ చులకన చేశారని, తాను పోందిన బిజినెస్ క్లాస్ టిక్కెట్ బదులు ఎకానమీ క్లాసులో ప్రయాణం చేయాలని చెప్పడం కూడా వారి అవమానంలో భాగమేనని అన్నారు. ఎయిరిండియా అధికారులే తప్పులు చేసిన.. తనను రెచ్చగోట్టింది చాలక.. తనపై నిషేధం విధించడం నిజంగా విడ్డూరమని అన్నారు. ఇక ఈ విషయంలో మీడియా కూడా అతి చేసిందని గైక్వాడ్ అన్నారు. అయితే యావత్ ఘటనపై స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతి రాజు.. ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థ అని.. అటు ప్రయాణికులతో పాటు ఇటు ఉద్యోగుల విషయంలోనూ తాము తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. మరీ ముఖ్యంగా భద్రత విషయంలో ఎట్టి పరిస్తితుల్లో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv sena  Ravindra Gaikwad  flight ban  parliament  Air India  

Other Articles