ప్రధాని మోడీ ఫోటోకు పూలమాల.. నివాళుర్పించి నగర మేయర్ Indore mayor pays 'floral tribute' to PM Modi

Indore mayor pays floral tribute to pm narendra modi madhya pradesh cm along with dead husband

Indore Mayor, Malini Gaud, PM Narendra Modi, Madhya Pardesh, shivraj singh chouhan, Laxman singh gawd, BJP, MLA Jitu Patwari. Patwari, Congress

Indore Mayor Malini Gaud paid floral tributes to Narendra Modi and Madhya Pradesh CM Shivraj Singh Chouhan along with putting a garland on her dead husband’s picture.

ప్రధాని మోడీ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించిన నగర మేయర్

Posted: 03/30/2017 10:19 PM IST
Indore mayor pays floral tribute to pm narendra modi madhya pradesh cm along with dead husband

గత జనరేషన్ కు చెందిన ప్రముఖ నటుడు.. రావుగోపాల్ రావును చూడగానే మనకు ఆయన డైలాగులన్నీ గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి జాలువారిన ఓ డైలాగ్.. ఓరేయ్ నాకు కోపం తెప్పించకు.. అదే జరిగితే నీ ఫోటోకు దండేసి దండం పెట్టయ్యగలను. గుర్తుకు వచ్చిందా..? అంటే దాని అర్థమే వేరు. కానీ బీజేపి నాయకురాలు, దివంతగత మాజీ కేంద్రమంత్రి లక్ష్మణ్ సింగ్ గౌద్ సతీమణి, ఇండోర్ నగర మేయర్ మాలినీ గౌద్‌ ఏకంగా ప్రధాన మంత్రి నేరేంద్రమోడీ చిత్రపటానికి పూలమాల వేసి ఏకంగా నివాళులు అర్పించేశారు.

అంతటితో అగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చిత్రపటానికి కూడా అమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీనంతటికీ కారణం ఏంటంటే ఓ వైపు ప్రధాని పోటో.. మరో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రఫటం వుండగా, మధ్యలో మాత్రం తన భర్త లక్ష్మణ్ సింగ్ గౌద్ పోటోను ఇలా ఒకే వరుస క్రమంలో అమె తన నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు. అమె భర్త మరణించడంతో ఆయన చిత్రపాటానికి దండవేసిన అమె పనిలోపనిగా ప్రధాని, ముఖ్యమంత్రి చిత్రాపటాలకు కూడా దండలు వేసి నివాళులు అర్పించారు.

కాగా కొందరు అమె వర్గీయులు మాత్రం అమెకు ప్రధాని మోడీ అన్నా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నా ఎంతో భక్తని.. దానిని చాటుకునే క్రమంలోనే అమె ఇలా చేశారని, దీనిని వక్రీకరించి చూడటం తప్పని చెప్పారు. ఇది పూర్తిగా తన నివాసంలో జరిగిన ప్రైవేటు కార్యక్రమమని దీనిని రాజకీయం చేయడం తగదని కూడా చెప్పారు. కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జితు పట్వారీ మాట్లాడుతూ మేయర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఆమె బీజేపీకి చెందిన నాయ‌కురాలు కాబ‌ట్టే ఆ పార్టీ చర్య తీసుకోవడం లేదని మండిప‌డ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles