మొగల్తూరు ఘటనతో ఇప్పటికైన ప్రభుత్వం మేలుకోవాలి: పవన్ pawan kalyan demands government should held responsible in mogalthur incident

Pawan kalyan demands government should held responsible in mogalthur incident

janasena, pawan kalyan, magalthur,Toxic Gas Incident, Aqua Food Park, west godavari, ap government, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan AgriGold Scam, Pawan Kalyan AgriGold Scam Victims, AgriGold Scam Janasena, AgriGold Scam AP Ministers, AgriGold Scam Victims, Pawan kalyan AgriGold Scam Victims, AgriGold Scam Victims Chandrababu Nadiu, AgriGold Victims Pawan Kalyan

pawan kalyan demands government and pollution control board to take responsible of toxic gas tank incident at aqua food park located in west godavari

ITEMVIDEOS: మొగల్తూరు ఘటనతో ఇప్పటికైన ప్రభుత్వం మేలుకోవాలి: పవన్

Posted: 03/30/2017 04:47 PM IST
Pawan kalyan demands government should held responsible in mogalthur incident

మొగల్తూరు ఘటనపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ స్పందించారు. రసాయనాల ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఐదుగురు కార్మికులు మృతి చెందిన ఘ‌ట‌నపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మొగ‌ల్తూరులోని ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్‌ పార్కులో చోటు చేసుకున్న ఈ ఘటనలో యావత్ తప్పిదం యాజమాన్యానిదేనని అన్నారు. పరిశ్రమలు నిబంధలను పాటించకపోవడం వల్లే కార్మికులు ప్రమదాల బారిన పడి అసువులు బాస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో ముఖాముఖి నిర్వహించి వారి బాధలను అడిగి తెలుసుకున్న ఆయన.. తిరిగు ప్రయాణానికి పయనమవుతూ మొగల్తూరు ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమ యాజమాన్యాలు నిబంధలను పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు. నిబంధనలు పాటించి వుంటే ప్రమాదాలు జరిగేవి కాదని చెప్పారు. ఇలాంటి ఘటనలపై ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని, లేకపోతే మున్ముందు మరిన్ని దారుణ ఘటనలు వెలుగుచూసే ప్రమాధముందని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు.

ప్రజలు ప్రాణాలంటే ఎవరీకీ లేక్కలేకుండా పోయిందని, మరీ ముఖ్యంగా పేదలు, సామాన్యులు ప్రాణాలకు విలువలేకుండా పోతుందని ఆయన అందోళన వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యానికి తలొగ్గకుండా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఘటనపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janasena  pawan kalyan  magalthur  Toxic Gas Incident  Aqua Food Park  west godavari  ap government  

Other Articles