మీ ఇంటి గోడల మీద ఈ గుర్తులుంటే డేంజర్..! wipe off these symbols on your compound wall

Wipe off these symbols on your compound wall

robbers, thieves, robbery, compound wall, pillars, symbols, observation, danger, threat of robbery, crime, robbers symbols, thives signs, sp pathanamthitta, police

If you see any of these symbols on your outside wall or pillar, quickly wipe it off. Your house is under observation for robbery.

మీ ఇంటి గోడల మీద ఈ గుర్తులుంటే డేంజర్..!

Posted: 03/22/2017 07:02 PM IST
Wipe off these symbols on your compound wall

మీ ఇల్లున్న వీధిలో అపరిచితులు సంచరిస్తుంటేనే అనుమానాంగా చూస్తాం. ఇక వారు అనుమానస్పదంగా కనిపిస్తే.. ఎవరింటికి వచ్చారంటూ అరా కూడా తీస్తాం. అయితే ఇది మీకు కనిపిస్తేనే.. అలా కాకుండా మీరు లేని సమయంలో ఏం జరుగుతుందన్న విషయం మీకు తెలుసా..? దొంగలు మీ వీధిలో సంచరించి.. మీ ఇంటిపై ఓ అంచనాకు వచ్చిన మీదట ఓ గుర్తును కూడా గీస్తారట. అదే ప్రమాదకరమని.. దీంతో మీ ఇంటిపై చోరులు సమస్త సమాచారాన్ని కనిపెట్టివున్నారన్నమాట. ఇక వారిలో ఏదో ఒక ముఠా మీ ఇంటిపై రెక్కీ నిర్వహించడమో.. లేక దొంగతనానికి యత్నించడమో చేస్తారన్నమాట.

అయితే మీ ఇంటికి సంబంధించిన సమాచారాన్ని తమ ముఠా సభ్యులకు తెలిసేందుకు వీలుగా మీ ఇంటి గోడలపై కానీ పిల్లర్లపై కానీ పలు గుర్తులు వేస్తారట. అలాంటి గుర్తులు ఏమైనా మీ ఇంటి గోడలపై వుంటే తక్షణం వాటిని తొలగించాలని, కడిగివేయాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇలాంటి రాతలు, గుర్తులు వుంటే తక్షణం పోలీసుల‌కి ఫిర్యాదు చేయండి. లేదంటే మీ ఇల్లు దోపిడీకి గురికావ‌చ్చునని అంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ సింబ‌ల్స్ ఉన్న చిత్రం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోలీస్ అధికారి పెట్టిన పోస్టును నెట్ జనులు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. తమ ఇళ్లను అప్రమత్తంగా వుంచుకుంటున్నారు. గోడ‌ల‌పై ఇటువంటి రాత‌లు క‌నిపిస్తే అవి చిన్న పిల్లలు గీసిన‌ పిచ్చి రాత‌లేన‌ని తీసిపాడేయకండి. ఆ రాత‌ల‌కు అనుగుణంగా ఓ ఏడు గుర్తులను చూపిస్తూ దొంగ‌లు అలా రాసి వెళుతున్ని చెప్పారు. ‌.అనంత‌రం దొంగ‌త‌నానికి వ‌చ్చి చోరీల‌కు పాల్పడుతున్నార‌ని చెప్పారు.‌. ఇక చిత్రంలో గుర్తులు వాటి అర్థాలను చూద్దామా..

* అంగ్ల డి అకారం: TOO Risky అంటే చోరికి పాల్పడేందుకు కష్టమైన ఇల్లు.

* అంగ్ల ఎం ఆకారం తిరబడి పైన గీత వుంటే: Alaramed House క‌రెంట్ ఫెన్సింగ్స్, అలారమ్ సిస్టం వున్న ఇల్లు.

* చిన్నని గుండుసున్నాలు వుంటే: మీ ఇల్లు సుసంపన్నమైనదని (Wealthy) అర్థం

* పెద్ద సున్నా దానిపై ఇంటుమార్కు: వుంటే మీ ఇంట్లో దొంగలించడం దండగా అని అర్థం

* రెక్టాంగిల్ బాక్సులో ఇంటుమార్క్ వుంటే: మీ ఇల్లు దొంగలకు మంచి టార్గెట్ అని దొంగతనం చేయడం తేలికట

* Previously Burgled అని రాసి ఉంటే గతంలోనే ఓ సారి దొంగ‌త‌నం జ‌రిగిన ఇళ్లట.

* బాక్సులో అడ్డంగా ఒక గీత గీసి వుంటూ మీ ఇంట్లో కేవలం వృద్దురాలు మినహా ఎవరూ వుండరని అర్థమట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles