‘‘ఈవీఎం ట్యాపరింగ్ నిజమేనని చెప్పిన బీజేపి ఎంపీ..’’ Mamata Banerjee wants all-party meet to discuss 'EVM tampering'

Mamata banerjee wants all party meet to discuss evm tampering

UP assembly polls, video, US, Subramanian Swamy, Polls, mayawati, Arvind kejriwal, West Bengal CM, Mamata Banerjee, Kolkata, India, Election Commission of India, all-party meet

Amid the allegations of tampering of EVMs in the recent UP assembly polls, West Bengal CM Mamata Banerjee said the CEC should convene an all-party meet to discuss the issue.

‘‘ఈవీఎం ట్యాపరింగ్ జరుగుతుందని చెప్పిన బీజేపి ఎంపీ..’’

Posted: 03/18/2017 10:08 AM IST
Mamata banerjee wants all party meet to discuss evm tampering

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా నమోదైన ఫలితాలపై విస్మయం వ్యక్తం చేసిన బీఎస్సీ అధినేత్రి మాయావతి.. తమ ఓట్లు ఏమయ్యాయని అంగలార్చుతూనే.. కేంద్రంతో ఈసీ మిలాఖాత్ అయ్యి ఈవీఎం మిషన్ల ట్యాపరింగ్ కు తెరలేపారని అనుమానాలను వ్యక్తం చేశారు. అమె తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఇదే తరహా ఆరోపణలను తెరపైకి తీసుకువస్తూ తమ పార్టీకి దక్కాల్సిన 20 నుంచి 30 శాతం ఓట్లు అకాళీదళ-బీజేపి కూటమికి వెళ్లాయని కూడా అయన విమర్శనాస్త్రాలు సంధించారు.

పలు పార్టీల నేతలు ఈవీఎం మిషన్ల వ్యవహారంలో అనుమానాలను వ్యక్తం చేస్తున్న తరుణంలో అవకాశం చిక్కడమే అలస్యమన్నట్లుగా కేంద్రంపై పోరుకు సిద్దమయ్యే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఈ వ్యవహరాంలోనూ రంగప్రవేశం చేశారు. ఈ విషయమై దీదీ స్పందిస్తూ తాము ఈవీఎం మిషన్లపై అనుమానాలు వ్యక్తం చేయడంలేదని, బీజేపి రాజ్యసభ సభ్యుడు.. న్యాయకోవిదుడైన సుబ్రహ్మణ్యస్వామి ఈవీఎం మిషన్లను ట్యాపంరింగ్ చేయవచ్చునని చెప్పారని దానిపైనే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు.

ఈ మేరకు అమె ఆయన వీడియో క్లిపింగ్ ను కూడా చూపించారు. సుబ్రహ్మణ్యస్వామి చెపిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని దానిపై విచారణ జరపాలని అమె డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈవీఎంలపై పలు పార్టీలు అనుమానాలను  వ్యకత్ం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్నిపార్టీలతో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యమంటూ ఈసీ ప్రకటనను చూసినా.. ట్యాంపరింగ్‌ పై సుబ్రహ్యణ్యస్వామి వ్యాఖ్యల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని మమత కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian Swamy  Polls  mayawati  Arvind kejriwal  West Bengal CM  Mamata Banerjee  all-party meet  

Other Articles