హెచ్ సీయు తరువాత జేఎన్ యూలో అదే ఘటన.. కేంద్రమంత్రికి నిరసన సెగ Slipper Hurled At Union Minister Pon Radhakrishnan

Slipper hurled at union minister pon radhakrishnan during jnu student s last rites

J Muthukrishnan, jnu, PhD student, Pon Radhakrishnan, suicide, Slipper Hurled, Union Minister, JNU students, Salem, Tamil Nadu

A slipper was hurled towards Union Minister Pon Radhakrishnan, when he arrived for last rites of selam JNU PhD student J Muthukrishnan

జేఎన్ యూ విద్యార్థి అంత్యక్రియలలో.. కేంద్రమంత్రికి నిరసన సెగ

Posted: 03/16/2017 05:37 PM IST
Slipper hurled at union minister pon radhakrishnan during jnu student s last rites

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను మర్చిపోకముందే.. అదే తరహా ఘటన ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకోవడం కలకలం రేపగా, సదరు విద్యార్థి అంత్యక్రియలకు హాజరైన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ నిరసన సెగ ఎదురైంది. ఆయన సొంత రాష్ట్రంలో తమిళనాడులోని సేలంలో జరిగిన జేఎన్ యూ దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్‌ అంత్యక్రియలకు హాజరైన ఆయనపై ఆంగతకుడొకరు చెప్పు విసిరాడు. అది ఆయనకు కొంతదూరంలో పడింది. దీంతో అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ ఆయనకు రక్షణగా నిలిచారు.

జేఎన్‌యూలో సమానత్వానికి చోటులేదని పేర్కొంటూ ముత్తుకృష్ణన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కుల వివక్షకు మరో విద్యార్థి బలయ్యాడన్న ప్రచారంతో తమిళనాట ఆగ్రహ జ్వాలలు రేగాయి. కుల వివక్షతో ఓ ప్రొఫెసర్‌ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ముత్తుకృష్ణన్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. ముత్తుకృష్ణన్‌ మృతిపై న్యాయ విచారణ జరపాలని సేలంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు చెన్నైలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.

రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనలో ఓ మేధావి ఆత్మహత్య అన్న కోణంలో అలోచించకుండా ఓ విద్యార్థి దళితుడా..? కాదా అన్న కోణంలో దానిని పక్కదారి పట్టించిన ఘటనపై ఇప్పటికే దళిత సంఘాలు అగగ్ిమీద గుగ్గిలంలా మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మత్తుకృష్ణన్ మరణం కూడా అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ పక్కదారి పట్టిస్తుందని, అసలు దళిత విద్యార్థులు అత్మహత్యల దిశగా ప్రేరేపిస్తున్న కారణాలను విశ్లేషించడంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఇప్పటి మంత్రి ప్రకాష్ జావదేకర్ కూడా అసక్తి కనబర్చడం లేదని కూడా దళిత సంఘాలు అరోపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles