సిద్ధూ మంత్రిగా ప్రమోషన్.. అయినా హ్యాండ్ ఇచ్చినట్లేనా? | Navjyot Singh Sidhu is cabinet minister but not Deputy CM.

Amarinder singh as punjab cm and navjot sidhu as cabinet minister

Captain Amarinder Singh, Punjab New Chief Minister, Navjot Sidhu Minister, Navjot Sidhu Amarinder Singh Feet, Navjot Sidhu Swearing, Punjab New Chief Minister, Punjab Deputy CM, Navjot Singh Sidhu Deputy CM

Captain Amarinder Singh is Punjab Chief Minister for the second time, no deputy CM post for Navjot Sidhu. Congress insiders to protest if Navjot Singh Sidhu becomes Punjab's Deputy CM.

సీఎంగా కెప్టెన్ ప్రమాణం.. మంత్రిగా సిద్ధూ

Posted: 03/16/2017 11:27 AM IST
Amarinder singh as punjab cm and navjot sidhu as cabinet minister

సుమారు పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుని విజ‌య దుందుభి మోగించింది కాంగ్రెస్. దీంతో 75 ఏళ్ల కెప్టెన్ అమరీందర్‌ సింగ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ తోసహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. చండీగఢ్ లోని రాజ్ భవన్ లో ఉదయం పది గంటలకు గవర్నర్ దగ్గరుండి వారిచే ప్రమాణం చేయించాడు.

ఆయనతో పాటు మరో తొమ్మిది మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఉన్నారు. ప్రమాణం చేసిన అనంతరం సిద్దూ కెప్టెన్ కాళ్లకు మొక్కటం హైలెట్ అయ్యింది. ఇక అమరీందర్ కేబినెట్లో మన్ ప్రీత్ సింగ్ బాదల్, చరణ్ జిత్ సింగ్ చన్నీ, సాధు సింగ్ దరమ్ సోత్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 77 స్థానాలను కైవసం చేసుకోగా, ఆప్ 20, అకాలీదళ్, బీజేపీల కూటమి 15 స్థానాల్లో గెలిచిన విషయం విదితమే. అమరీందర్ గతంలో 2002-2007 మధ్య కాలంలో సీఎంగా పని చేశాడు కూడా.

సిద్ధూకి హ్యాండిచ్చారా?

రాజ్యసభ సభ్యత్వం, బీజేపీకి గుడ్ బై చెప్పిన సిద్ధూ అనంత‌రం కొత్త పార్టీ పెట్ట‌డం, కొన్నాళ్ల‌కు ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయ‌న చేర‌తార‌ని అనుకోవ‌డం వంటి ఎన్నో ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఎవరి ఊహకు అందకుండా చివ‌ర‌కు ఆయన కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నాడు. ఆ సమయంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేయ‌డంతోనే పార్టీ లో చేరారని విశ్లేష‌కులు భావించారు. కానీ సీన్ అలా లేదు. ముఖ్య‌మంత్రితో పాటు ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ తొమ్మిదిమంది మంత్రుల్లో ఆయ‌న ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పదవి మాత్రం దక్కలేదు. అయితే సిద్ధూకి ఆ పదవి గనుక ఇవ్వకపోతే ఆందోళన తప్పదని కాంగ్రెస్ లోని ఆయన మద్ధతుదారులు హెచ్చరించారు కూడా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Punjab  New CM  Captain Amarinder Singh  Navjot Sidhu  

Other Articles