జాత్యాంహకార దాడులపై నిష్ఫక్షపాత దర్యాప్తు Sushma Swaraj 'Powerful Voice' On Hate Crime

A warm lok sabha welcome for sushma swaraj and her powerful voice

Sushma Swaraj, US hate attacks,Srinivas Kuchibhotla,Paul Ryan,Mallikarjun Kharge,Lok Sabha,Sushma Swaraj in Parliament,Sushma Swaraj at Lok sabha,Sushma Swaraj illness,Uma Bharti,Foreign Minister

Sushma Swaraj dismissed Mallikarjun Kharge's charge that the government was silent on hate attacks against Indians in the US and said the issue had been taken up with the US government at "very high levels".

జాత్యాంహకార దాడులపై నిష్ఫక్షపాత దర్యాప్తు

Posted: 03/15/2017 06:16 PM IST
A warm lok sabha welcome for sushma swaraj and her powerful voice

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యాంహకార దాడులను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇటీవలికాలంలో జరిగిన దాడులపై నిష్పక్షపాత విచారణ చేయాలని అమెరికాలోని దర్యాప్తు సంస్థలను కూడా కోరినట్లు లోక్‌సభలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటన చేశారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత ఉత్పన్నం అవుతున్న పరిస్థితిని విదేశాంగశాఖతో పాటు అమెరికాలోని భారత రాయభార అధికారులు కూడా నిశితంగా గమనిస్తున్నారని ఆమె తెలిపారు.

భారతీయులపై జరిగిన జాత్యాంహకార దాడులపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతున్నదని, ఈ విచారణను వేగవంతం చేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని తాము కోరామని సుష్మా వెల్లడించారు. ఎన్నారైలు కూచిభొట్ల శ్రీనివాస్‌ తదితరులపై జరిగిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా ఆ దేశ ఉన్నతాధికారులు ఖండించారని చెప్పారు. బాధిత కూచిభోట్ల శ్రీనివాస్‌ దీప్‌ రాయ్‌ కుటుంబాలతో తాము మాట్లాడామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆమె సభకు హామీ ఇచ్చారు.

విదేశాల్లోని భారతీయుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ఆమె స్పష్టం చేశారు. జాత్యాంహకార కాల్పుల్లో మృతిచెందిన కూఛిబోట్ల శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో తాము మాట్లాడమని చెప్పారు. సకాలంలో తమకు పూర్తి సహకారం అందించడం.. భారత్‌తో తమ అనుబంధాన్ని చాటుతున్నదని కూచిభొట్ల శ్రీనివాస్‌ భార్య అమెరికాలోని భారత రాయబారికి రాసిన లేఖలో పేర్కొన్నారని ఈ సందర్భంగా సుష్మా తెలిపారు. అటు దాడులను ఎదుర్కోన్న ఇతర భారతీయులకు కూడా విదేశాంగ శాఖ అండగా నిలిచిందని అమె చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles