స్టెల్లా ముంచుకోస్తుంది.. ఇళ్లలోంచి బయటకు రాకండీ..! NY declares state of emergency ahead of Stella

Ny declares state of emergency as east coast schools close ahead of stella

America, state of emergency, New York, powerful snowstorm, tristate area, stella, snowfall, Rail Road, Metro-North, Governor Andrew Cuomo

A state of emergency has been declared for New York as a powerful snowstorm moves towards the tristate area. The level of snowfall that is forecasted would prohibit the safe operation of Long Island Rail Road and Metro-North.

స్టెల్లా ముంచుకోస్తుంది.. ఇళ్లలోంచి బయటకు రాకండీ..!

Posted: 03/14/2017 03:38 PM IST
Ny declares state of emergency as east coast schools close ahead of stella

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. అందుకు కారణంగా స్టెల్లానే. ఇంతకీ ఎవరీ స్టెల్లా.. అంటారా.. అదేనండీ ఇప్పుడు అమెరికాను వణికిస్తున్న పెను మంచు తుఫాను. స్టెల్లా కార్తెలో తుపానుగా రూపాంతరం చెందిన నేపథ్యంలో దానిని స్టెల్లాగా నామకరణం చేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న ఈ మంచు వల్ల అమెరికాలోని ముఖ్యంగా న్యూయార్క్ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించింది. వాహనాలు రోడ్లపైకి వచ్చేందుకు కూడా వీల్లేనంతగా మంచు తీవ్రత పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఫిలడెల్ఫియాలో సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఎమర్జెన్సీని విధించినట్లు తెలిపారు. విస్కన్సిన్ రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీని విధించారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మిల్వౌకీ కౌంటీ, కెనోషా, వౌవాటోసా, సెయింట్ ఫ్రాన్సిస్, వెస్ట్ అల్లీస్, జెర్మన్‌టౌన్, ప్లీజంట్ ప్రైరీ, సౌక్విల్లీ, న్యూబర్గ్ వంటి విస్కన్సిన్ రాష్ట్ర ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీని విధించినట్లు అధికారులు ప్రకటించారు. న్యూజెర్సీ లోని ఎమర్జెన్సీ విధించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ క్రిస్ క్రిష్టీ వెల్లడించారు. పెనస్లేవియా రాష్ట్రంలోని హరీస్‌బర్గ్ కూడా మంచు ముప్పును ఎదుర్కొంటోంది.

మేరీలాండ్, న్యూయార్క్ సిటీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నగరాల్లో ప్రజలెవరూ ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇవాళ్టి నుంచి స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నామన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక తిరిగి తరగతులు మొదలవుతాయన్నారు. ప్రైవేటు కంపెనీలు కూడా ఉద్యోగులకు సెలవులు ప్రకటించాలని సూచించారు. పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సంయుక్తంగా మంచును తొలగించే ప్రక్రియను చేపట్టారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  state of emergency  New York  powerful snowstorm  tristate area  stella  

Other Articles