ఆమ్మ ‘అర్కే నగర్’ ఉప ఎన్నికకు మోగిన నగారా..! by election in jayalalithaa s rk nagar constituency

By election in jayalalithaa s rk nagar constituency

Jayalalithaa, RK Nagar constituency, By-election, AIADMK, Tamil Nadu politics, Jayalalithaa news, Jayalalithaa latest, By-Election in Jayalalithaas Constituency, Tamil nadu, deepa jaykumar, panneerselvam, palanisamy

Election Commission of India released the notification for the by-election in RK Nagar constituency through which Jayalalithaa represented during the last Assembly elections.

ఆమ్మ ‘అర్కే నగర్’ ఉప ఎన్నికకు మోగిన నగారా..!

Posted: 03/09/2017 09:06 PM IST
By election in jayalalithaa s rk nagar constituency

తమిళనాడులో మరో కీలక ఎన్నికకు నగారా మోగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలిలత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. 17న ఉప ఎన్నిక ఫలితం రానుంది. జయలలిత మృతి, శశికళ జైలుకు వెళ్లడం తదితర పరిణామాలు నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

అధికార అన్నాడీఎంకే పార్టీ పళనిస్వామి ఈ ఎన్నికలలో విజయాన్ని సాధించి.. తన ప్రభుత్వానికి తమిళప్రజల మద్దతు వుందని చాటుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అటు పన్నీరుసెల్వం వర్గా కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకుని అమ్మ అభిమానుల మద్దతు తనకే వుందని నిరూపించుకోవాలని యోచనలో వున్నారు. కాగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తానే అమ్మకు అసలైన వారసురాలినంటూ చెప్పుకుని రాజకీయ అరంగేట్రం చేయడంతో ఆర్కే నగర్ బరిలో గెలచి తన వాదనకు ప్రజల బలం కూడా తోడైందని చాటుకోవాలని భావిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అందుకు అనుగూణంగా పావులు కదుపుతున్న డీఎంకే కూడా ఈ ఉప ఎన్నికలతో అర్కే నగర్ లో పాగా వేయాలని భావిస్తోంది. ఇక డీఎంకేతో పాటు ఇతరాత్ర ప్రతిపక్ష పార్టీలు కూడా అర్కేనగర్ బరిలో నిలిచేందుకు ఉత్సూకత చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

కాగా ఖాళీ అయిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల అయింది.  ఆర్కేనగర్‌ (తమిళనాడు)తో పాటు థీమజీ (అస్సాం), భోరంజ్‌ (హిమాచల్‌ ప్రదేశ్)‌, అతెర్‌, బాంధవ్‌గఢ్‌ (మధ్యప్రదేశ్)‌, కంతీదక్షిన్‌ (వెస్ట్‌ బెంగాల్)‌, ధోల్‌పూర్‌ (రాజస్థాన్‌), నన్‌జన్‌గౌడ్‌, గుండ్లుపేట్‌ (కర్ణాటక) లతిపురా (జార్ఖండ్)‌, ఉప్పేర్‌ బుర్‌తూక్‌ (సిక్కిం), రాజౌరీ గార్డెన్‌ (ఢిల్లీ) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అలాగే జమ్మూ,కశ్మీర్‌లోని శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌, కేరళలోని మలప్పురం పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles