రాహుల్ కూడా అఖిలేష్ కు ఓటెయ్యడు: మోడీ rahul gandhi will also note vote for akhilesh yadav, Says Modi

Rahul gandhi will also note vote for akhilesh yadav says modi

Narendra Modi, Prime Minister Modi, Akhilesh yadav, Rahul Gandhi, cycle, jonpur road, express highway, up polls, up assembly elections, bjp, sp, congress

Prime Minister Narendra Modi mocks akhilesh during an election rally in uttarpradesh, says even rahul gandhi will not vote for sp, if they travell on their cycle on jonpur roads.

రాహుల్ కూడా అఖిలేష్ కు ఓటెయ్యడు: మోడీ

Posted: 03/04/2017 04:59 PM IST
Rahul gandhi will also note vote for akhilesh yadav says modi

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌పై ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. అఖిలేశ్‌ పరిపాలనలో ఏ తల్లి, ఏ కూతురు క్షేమంగా లేరని అన్నారు. గాయత్రి ప్రజాపతిలాంటి రేపిస్టులకు అఖిలేశ్‌ ఆశ్రయం ఇస్తుంటే మహిళలు భయపడిపోతున్నారని చెప్పారు. జాన్‌పూర్‌లోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అఖిలేశ్‌పై మాటల యుద్ధం ప్రకటించిన మోదీ.. ‘అఖిలేశ్‌ నన్ను ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు మీద ప్రయాణించమన్నాడు. అలా చేస్తే నా ఓటుకు కూడా అఖిలేశ్‌కే వేస్తానని చెప్పాడు. నేను అఖిలేశ్‌ను ఆయన కొత్త దోస్తు(రాహుల్‌)తో కలిసి సైకిల్‌పై జాన్‌పూర్‌ రోడ్లలో వెళ్లాలని కోరుతున్నాను.

కచ్చితంగా ఆయన దోస్తు కూడా అఖిలేశ్‌కు ఓటెయ్యడు’ అని మోదీ తిప్పికొట్టారు. దేశంలో భక్తులంతా గాయత్రి మంత్రం జపిస్తుంటే, ఎస్పీ ఆ పార్టీ కూటమి మాత్రం లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రి ప్రజాపతి పేరును తలుస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాక కూడా గాయత్రి ప్రజాపతి తన ఓటు వినియోగించుకునేందుకు వెళ్లాడని, పోలీసులు మాత్రం అతడికి కోసం చూస్తున్నారని, అఖిలేశ్‌ మాత్రం అతడికి అండదండలు ఇస్తున్నారని విమర్శించారు.

ఉత్తర్ ప్రదేశ్ వాసులకు, అందులోనూ ముఖ్యంగా బీజేపి నేతలు, శ్రేయోభిలాషులకు హోలీ పండగ ముందే వస్తుందన్నారు. మార్చి 11న ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్లు హోళీ జరుపుకుంటారని, అయితే దేశ ప్రజలంతా యూపీలో బీజేపీ విజయాన్ని మార్చి 13న హోళీ రోజున జరుపుకుంటారని అన్నారు. విద్యుత్‌ అందుబాటులో లేని గ్రామాలు యూపీలో చాలా ఉన్నాయని, దేశంలో ఇప్పటికీ విద్యుత్‌ సౌకర్యం లేని గ్రామాలు 18,000 ఉంటే అందులో 1500 గ్రామాలు యూపీవేనని మోదీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles