అప్ లో అక్రమార్కుడా..? అమాత్యుని ఆస్తులు అటాచ్.. Taxmen attach Rs 33 cr assets 'linked' to Satyendar Jain

Aap minister s binami property worth rs 33 cr attached by taxman

Arvind Kejriwal, Aam Aadmi Party, Satyendar Jain, rajendra bansal, Narendra Modi, infosolutions, Income Tax, Delhi Police, benami property, satyendar jain assets attached, aap minister

Tax authorities have attached more than 100 bighas of land in the capital as well as shares in companies allegedly linked to Delhi minister Satyendar Jain, under the law against benami property.

అమాత్యుని ఆస్తులు అటాచ్.. అక్రమార్జనేనా..?

Posted: 03/04/2017 11:47 AM IST
Aap minister s binami property worth rs 33 cr attached by taxman

కేంద్ర ప్రభుత్వానికి, దేశ రాజధాని ఢిల్లీ లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి, పార్టీలకు మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమనేలా వున్న వైరానికి మరింత ఇంధనం తోడైంది. ఇప్పటికే అప్ పార్టీ తమపై ఎలాంటి చర్యలు జరిగినా, ఏ కీడు చోటుచేసుకున్నా అందుకు కారణం కేంద్రంలోని బీజేపి ప్రభుత్వమేనని అన్నింటికీ నరేంద్రమోడీ సర్కార్ కు అపాదిస్తున్న తరుణంలో మరో సంఘటన చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలో వుండే అదాయపన్నుశాఖ అధికారులు అప్ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ కు చెందిన అస్తులను అటాచ్ చేశారు. అయితే ఆదాయపన్నుశాఖ అధికారులు అటాచ్ చేసిన అస్తులన్నీ మంత్రివర్యులు అక్రమంగా ఆర్జించారని అదాయ శాఖ అభియోగాలు నమోదు చేసింది. దీంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య మరింతగా వైరం పెరిగిపోనుంది.

 ఢిల్లీలో మంత్రికి చెందిన దాదాపు 40 ఎకరాల భూమితో పాటు పలు కంపెనీలలో ఉన్న షేర్లను కూడా ఎటాచ్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మధ్య వార్ మరింత ముదిరింది. భూమి రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ. 17 కోట్లు, షేర్ల విలువ రూ. 16 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మార్కెట్ విలువ ఇంకా ఎక్కువేనంటున్నారు. ఇండో మెటల్ఇంపెక్స్, అకించన్ డెవలపర్స్, ప్రయాస్ ఇన్ఫోసొల్యూషన్స్, మంగల్యతన్ ప్రాజెక్ట్స్ కంపెనీలలో ఉన్న షేర్లను కూడా ఎటాచ్ చేశారు. ఈ కంపెనీలకు సత్యేంద్ర జైన్ నగదు రూపంలో చెల్లింపులు చేసి, షేర్ల కొనుగోలుకు అక్రమంగా బుక్ ఎంట్రీలు చేయించుకుంటున్నారని పన్ను అధికారులు ఆరోపించారు.
 
ఇండోమెటల్ఇంపెక్స్‌కు చెందిన మరికొంత భూమిని కూడా ఎటాచ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతులైన మంత్రులలో సత్యేంద్ర జైన్ ఒకరు. ఆయనకు ఆరోగ్యం, రవాణా, పీడబ్ల్యుడీ లాంటి కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఆదాయపన్ను శాఖ చర్యలపై సత్యేంద్ర జైన్‌ను మీడియా ప్రశ్నించగా, ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రాథమికంగా 90 రోజుల పాటు ఈ ఎటాచ్‌మెంట్ ఉంటుంది. బినామీ లావాదేవీలతో సంపాదించిన సొమ్ముతోనే ఈ ఆస్తులన్నింటినీ సేకరించారని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఆదాయాన్ని దాచిపెట్టినందుకు మంత్రిపై ప్రత్యేకంగా దర్యాప్తు జరుగుతోంది. కోల్‌కతాకు చెందిన బడా ఆపరేటర్లు జీవేంద్ర మిశ్రా, అభిషేక్ చొఖానీ, రాజేంద్ర బన్సల్ తదితరులతో సత్యేంద్ర జైన్‌కు సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. వీళ్లు నగదు తీసుకుని కేవలం కాగితాల మీదే ఉన్న కంపెనీల షేర్లను ఎక్కువ ధరలకు ఇస్తారు. ఆ షేర్ల రూపంలో వాళ్ల డబ్బంతా తెల్లధనం అయిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  aam admi party  satyendar jain  aap minister  income tax  assets attach  

Other Articles