గాలి కూతురి పెళ్లికి మించిన బిజేపి ఎమ్మెల్యే కళ్యాణం..! 30,000 guests, drone-cams in Maharashtra BJP chief’s son wedding

30 000 guests drone cams in maharashtra bjp chief s son wedding

Maharashtra, BJP, Raosaheb Danve, Devendra Fadnavis, wedding, Mumbai, Lavish wedding, Marathwada, Aurangabad, Maharashtra BJP, Bhokardan, Drones at wedding, Wedding of BJP leader's son

The BJP Maharashtra chief has hit the headlines over his son’s opulent wedding that involved sleek video invites, designer sets and a lavish ceremony monitored by police using drone-mounted cameras.

ITEMVIDEOS: గాలి కూతురి పెళ్లికి మించిన బిజేపి ఎమ్మెల్యే కళ్యాణం

Posted: 03/03/2017 05:32 PM IST
30 000 guests drone cams in maharashtra bjp chief s son wedding

కేంద్ర రాష్ట్రాల్లో అధికారం వుందంటే ఇక తమకు కావాల్సిన పనులన్నీ సమకూరు ధరలోన అన్నట్లు.. అన్ని పనులు చకచకా జరిగిపోతాయనడంలో అతిశయోక్తి లేదు. మహారాష్ట్రలో జరిగిన ఇద్దరు బీజేపి నేతలు వివాహాలే ఇందుకు ఉదాహరణ. పాత పెద్ద నోట్ల రద్దు తరువాత కూడా ఇంత ఆర్భాటంగా, అంగరంగ వైభోగంగా వివాహాలు జరుగుతున్నాయంటే ఆయా వర్గాలపై డీమానిటైజేషన్ ప్రభావం ఎంత మాత్రం పడిందో సామాన్యుడికి ఇట్టే అర్థమైపోతుంది. ఇక పైపెచ్చు.. పెళ్లిళ్లకు 500 మందిని మాత్రమే పిలవాలని అలాకాని పక్షంలో అంటూ అనేక నిబంధనలు తీసుకువస్తున్న కేంద్రంలోని కీలక వ్యక్తులై వుండి కూడా హంగు, అర్భాటాలకు ఏమాత్రం తగ్గకుండా పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు.

పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి కూతురు పెళ్లికి సుమారు 500 కోట్ల రూపాయలను వెచ్చించారన్న వార్తలు అప్పట్లో పతాకశీర్షికలను అకర్షించాయి. అయితే ఆ తరువాత కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ కూతరు వివాహం కూడా అలాగే జరిగిందని, ఏకంగా విమానాశ్రయంలో చార్టడ్ ఫ్లైట్ లు అధికమయ్యాయన్న టాక్ కూడా వచ్చింది..ఇక అంతస్థాయిలో కాకపోయినా.. మరో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా తన కూతురు వివాహాన్ని బాలయోగి స్టేడియంలో అలానే నిర్వహించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వివాహాలన్నింటినీ తలదన్నేలా మరో బీజేపి ఎమ్మెల్యే వివాహం జరగడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట..  బహుశా ఈ మాటలు కూడా చిన్నబోయేంత వైభవంగా జరిగిన  ఓ బీజేపీ నేత కుమారుని వివాహ వేడుక ఇపుడు హాట్‌టాపిగ్గా నిలిచింది.  భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు రావ్‌సాహెబ్ పాటిల్ దన్వే కుమారుడు, భోకార్దన్ ఎంఎల్ఏ సంతోష్‌ పాటిల్‌ వివాహం గురువారం అత్యంగా వైభవంగా జరిగింది. అయితే ఏంటి అనుకుంటున్నారా...అయితే దీని  ప్రత్యేకత  ఏంటో   చెప్పాల్సిందే....వీడియో ఆహ్వానాలు, డిజైనర్ సెట్లు, డ్రోన్ కెమెరాలతో ,  పోలీసు నిఘాలో నిర్వహించిన పెళ్లితో రావ్‌ సాహెబ్‌​ అందరి దృష్టిని ఆకర్షించగా.. మరోవైపు ఈ పెళ్లి ఆహ్వానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ  వీడియోను నూతన వరుడు సంతోష్‌  శుక్రవారం త‌న‌ ఫేస్‌బుక్ లో పోస్ట్‌ చేశారు. సినిమా స్టయిల్‌ ను మించి రూపొందించిన ఈ వీడియో వైరల్‌ అయింది. పెళ్లి కూతురితో క‌లిసి పెళ్లికొడుకు సైకిల్ తొక్కుతూ, పార్క్‌లో డ్యాన్స్ వేస్తూ ఉన్న ఆ వీడియో అందరినీ ఆక‌ట్టుకుంటోంది.  సుమారు 45  వేలకు పైగా లైక్స్‌ను, వందల షేర్లను సాధించింది. దాదాపు 30,000 మంది అతిథులు హాజరైన ఈ పెళ్లి వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా మొత్తం క్యాబినెట్ విచ్చేయడం మరో విశేషంగా నిలిచింది. సంతోష్‌ 2014 ఎన్నిక‌ల్లో భోకార్దన్ నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏగా ఎన్నిక‌య్యారు. గత రెండేళ్లుగా కరువు కాటకాలతో అల్లాడుతున్న ఈ  నియోజకవర్గంలో భారీ ఖర్చుతో, అత్యంత వైభవంగా పెళ్లి వేడుకలు నిర్వహించడం వార్తల్లో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  BJP mla  Santosh  renu  marriage  Video invite  trending news  

Other Articles