కేసీఆర్ ఏమో దోస్తీ.. వీళ్లేమో ఎగిరెగిరి పడుతున్నారు | Akbaruddin on Aler Encounter.

Akbaruddin about darussalam politics

KCR MIM, AIMIM Party, Akbaruddin Owaisi Donkey Politics, Akbaruddin Owaisi Darussalam, MIM Revival Day, Akbaruddin Owaisi KCR Government, Akbaruddin Owaisi SC ST, Akbaruddin Owaisi Hit Congress, KCR MLC Elections, KCR Aler Encounter

All India Majlis-e-Ittehadul Muslimeen Leader Akbaruddin Owaisi speaking at a public meeting on the occassion of the 59th Revival Day of AIMIM at Darussalam. Without hesitating to take the opportunity to attack opposition parties, the junior Owaisi said: "while Delhi is the capital of India, Darussalam has became the capital of Muslims."

ముఖ్యమంత్రి సారీ... అంతా మజ్లిస్ గొప్పతనమే!

Posted: 03/03/2017 10:44 AM IST
Akbaruddin about darussalam politics

ఎవరి సంగతి ఏమోగానీ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మజ్లిస్ తో మాత్రం మాంచి దోస్తీ కొనసాగించటం చూస్తూ ఉంటాం. విమర్శలు, ప్రత్యారోపణల సంగతి పక్కనబెట్టి ఆ పార్టీ నేతలతో కలివిడిగా మెలుగుతుంటాడు. ఆ చొరవతోనే లోకల్ బాడీలో 141 మంది సభ్యులున్న పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు కట్టబెట్టేందుకు రెడీ అయ్యాడు కూడా. ప్రతిపక్షం నుంచి ఎలాంటి పోటీ లేకపోయినా భవిష్యత్తులో పరోక్ష మిత్రపక్షంగా ఎంఐఎం ను కొనసాగించాలన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఈ పని చేస్తున్నాడని స్పష్టం అవుతుంది.

అయితే ఈ లోపాయికారి ఒప్పందం సంగతి ఏమోగానీ, అధికార పక్షం అని కూడా చూడకుండా పైకి కఠువుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది ఎంఐఎం. పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో గురువారం జరిగిన ఎంఐఎం 59వ వార్షికోత్సవ సభలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రితో క్షమాపణ చెప్పించిన ఘనత ఒక్క మజ్లిస్ పార్టీదేనంటూ ఆ పార్టీ శాసనసభాపక్ష నేత పేర్కొన్నాడు.

యావత్ ముస్లింల చూపు దారుస్సలాం రాజకీయాలపైనే ఉందని, అక్బరుద్దీన్ వాళ్లకు ఎక్కడ అన్యాయం జరిగినా గళం విప్పి న్యాయం జరిగే వరకు పోరాడుతున్నట్టు పేర్కొన్నాడు. మక్కామసీదు ఘటనలో నిరపరాధులకు న్యాయం చేసి అప్పటి ముఖ్యమంత్రితో క్షమాపణలు చెప్పించామని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఆలేరు ఎన్‌కౌంటర్‌ బాధ్యులను జైలుకు పంపి తీరుతామని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేందుకు  ఇందుకోసం ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని ప్రకటించాడు.

ఇక చివర్లో జాతీయ రాజకీయాల గురించి టచ్ అప్ ఇస్తూ... ఇప్పటి వరకు రాజకీయాల్లో రెడ్డి, రావు, మారాఠా, బహుజనులు, లింగాయత్, యాదవులు తమ వాణి వినిపించారని, ఇప్పుడు గాడిదలు కూడా మాట్లాడుతున్నాయంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గాడిదలపై రాజకీయాలు జరగడం విడ్డూరంగా ఉందన్న అక్బర్ రాజకీయాలు రోజురోజుకు మరింత దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MIM  Akbaruddin Owaisi  Darussalam  KCR  

Other Articles