ఇరాన్ వాళ్లనుకుని ఇండియన్స్ ను కాల్చాడట Kansas shooting susspect purinton says he killed iranians

Kansas shooting susspect purinton says he killed iranians

adam purinton, iranians, indians, United States of America, Srinivas dead body, sunayana, alok madasani, alok madasani speaks, olathe shooting, Ian Grillot, austins shooting, interview, shooting, hate crime

A man arrested last week for shooting two Indians at a Kansas bar allegedly told a barmaid he had just opened fire on some "Iranian people".

ఇరాన్ వాళ్లనుకుని ఇండియన్స్ ను కాల్చాడట

Posted: 03/01/2017 10:56 AM IST
Kansas shooting susspect purinton says he killed iranians

మా దేశం విడిచి పారిపోండీ అంటూ కన్సాస్ ప్రాంతంలో ఆస్గింగ్స్ ఏరియాలో గల ఓ బారులో జాత్యాంహకర వ్యాఖ్యలు చేసి అపై ఇద్దరు తెలుగువారిపై కాల్పులకు తెగబడి.. ఒకరి మరణానికి కారణమైన నిందితుడు అడమ్ పురింటన్ తాను ఇండియన్స్ ను ఇరానియన్లు అనుకుని కాల్చనట్టు చెప్పుకోచ్చాడు. కూచిభొట్ల శ్రీనివాస్, అతని స్నేహితుడు అలోక్, మరో అమెరికన్ పై కాల్పులు జరిపిన ఆడమ్ పూరింటన్, తాను చేసిన నేరాన్ని జాన్సన్ కౌంటీ జిల్లా కోర్టు ముందు అంగీకరించి.. తాను పోరబాడి ఇరానియన్లు అనుకుని ఇండియన్లను కాల్చానని చెప్పాడు.

51 ఏళ్ల పూరింటన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, నేరాన్ని అంగీకరించాడు. అయితే కాల్పుల ఘటన అనంతరం మరో బార్ కు వెళ్లిన పూరింటన్ అక్కడి బార్ సిబ్బందితో తాను ఇద్దరు ఇరానియన్లను కాల్చానని చెప్పాడని ప్రత్యక్ష సాక్షులు న్యాయస్థానానికి వెల్లడించారు. కాగా, పూరింటన్ తరఫున న్యాయవాదిగా మైఖేల్లె డ్యూరెట్ ను నియమించిన కోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇక వీరిద్దరూ ఇరాన్ జాతీయులై ఉంటారని భావించి కాల్పులు జరిపినట్టు పూరింటన్ వ్యాఖ్యానించినట్టు బార్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు.

కాల్పుల అనంతరం మిస్సోరీ ప్రాంతంలోని క్లింటన్ ఏరియాలో ఉన్న మరో బారుకు వెళ్లిన పూరింటన్, తాను ఇరాన్ జాతీయులను కాల్చినట్టు చెప్పాడని ఆ ఉద్యోగి తెలిపాడు. పోలీసుల విచారణలో ఇతను కూడా కీలక సాక్షి. కాగా, ఈ కేసులో పూరింటన్ పై అభియోగాలు రుజువైతే, కనిష్ఠంగా యాభై సంవత్సరాల జైలుశిక్ష నుంచి మరణదండన వరకూ శిక్ష పడవచ్చని సమాచారం. అయితే కాల్పుల ఘటనకు ముందు భారతీయులతో మాట్లాడిన పూరింటన్ వారు అమెరికాలో లీగల్ గానే వుంటున్నారా..? అని కూడా అడిగాడని అలోక్ మదసాని ఘటనపై స్పందిస్తూ చెప్పాడు.

అయితే ఇండియన్లకు, ఇరానియన్లకు మధ్య తేడా అతనిక తెలియదా..? తెలియకపోతే అది కూడా అడగివుండవచ్చు కదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం నిందితుడ్ని రక్షించడానికే ఈ తరహాలో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్న వాదనలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలావుండగా, ఇరానియన్లు, అయినా.. భారతీయులు అయినా.. కాల్పులకు తెగబడి అంగీకరించిన నేపథ్యంలో నిందితుడికి శిక్షపడటం మాత్రం ఖాయమని న్యాయకోవిదులు పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adam purinton  iranians  indians  Srinivas  Alok Madasani  Ian Grillot  olathe shooting  US hate crime  

Other Articles