అమెరికాలో ఇండో అమెరికా వ్యాపారవేత్త అరెస్టు Indian-American businessman held for defrauding lenders

Indian american businessman held for defrauding lenders

Indian-American businessman, Alpha Omega Jewellers, jewellery chain, defrauding, Handa, Boston, US court, Los Angeles

An Indian-American businessman, who previously owned a popular jewellery chain in Boston, has been arrested at the Los Angeles International Airport on his return from India on charges of defrauding his former lenders.

అమెరికాలో ఇండో అమెరికా వ్యాపారవేత్త అరెస్టు

Posted: 02/26/2017 09:59 AM IST
Indian american businessman held for defrauding lenders

మన దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసి విదేశాలకు వెళ్లిన వారిపై సానుభూతిని ప్రకటించే పశ్చిమ దేశాలు.. అదే అక్కడి బ్యాంకులలో రుణాలు తీసుకుని వ్యాపారం సాగక నష్టాల బారిన పడితే మాత్రం వారిపై కనీసం కనికరం చూపకుండా కటకటాల వెనక్కి నెడుతున్నాయి. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హాండాను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించని కారణంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హాండాను యూఎస్‌ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం విచారణ నిమిత్తం బోస్టన్‌కు తరలించారు.

బోస్టన్‌లో ఆల్ఫా ఒమేగా జువెలర్స్‌ యజమాని అయిన హాండాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు. అనూహ్యంగా 2007 డిసెంబర్‌లో అమెరికాను వదిలివెళ్లాడు. రూ.46.6 కోట్ల మొత్తాన్ని చెల్లించకుండా ఎగవేశారని అధికారుల లెక్కల్లో తేలింది. దీంతో హాండా అమెరికాకు తిరిగిరాగానే లాస్‌ఏంజెలెస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.  ఆయనపై మోపిన అభియోగాలు రుజువైతే అమెరికా చట్టాల ప్రకారం 20 ఏళ్ల వరకు జైలు పడే అవకాశముందని ఎఫ్ బీఐ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles