శివుడాజ్ఞ లేదనుకుంటా..? శివుడి అజ్ఞ లేకుండా చిన్న చీమైనా కుట్టదు. అలాంటి ఓ బాలిక నిండు ప్రాణం ఎలా పోతుంది.? అర్థం కాలేదా..? సకల చరాచర ప్రాణకోటిలో ఎవరు ప్రాణం ఎప్పుడు ఎలా తీయాలన్నది ఆయన అజ్ఞల మేరకే జరుగుతుందని. ఆయనే సృష్టి, స్థితి, లయకారుడన్నది హైందర ధర్మాన్ని పాటించే వారి విశ్వాసం. అందుకనే ఆ అమ్మాయిని అదృష్టవంతురాలని అంటున్నాం. అది ఓ చిన్న రైల్వే స్టేషన్. స్టేషన్లో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు.
ట్రాకుపై నుంచి గూడ్స్ రైలు వెళ్తుంది. అంతా అయ్యో అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత అన్యాయం జరిగిపోయింది. కళ్ల ముందు ఎంత దారుణం జరిగిపోయింది అంటూ ప్రయాణికులందరకీ వార్త తెలిసి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ లోగా ఏంజరిగిందని తెలుసుకున్న ఓ వ్యక్తికి అక్కడున్న వారు సమాచారం అందించారు. ఓ బాలిక రైల్వే ట్రాక్‌పై ఉండగా గూడ్స్ రైలు వేగంగా దూసుకొచ్చింది. ఆ బాలికకు ఏం జరిగిందో అంటూ ఎదురుచూస్తున్నాం అన్నారు. కొందరు మాత్రం ఆ బాలిక దిక్కుతోచని స్థితిలో వేగంగా ఆలోచించి ట్రాక్‌పై రెండు పట్టాల మధ్య పడుకుండిపోయిందన్నారు. బాలికకు ఏం జరగకూడదనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు.
ఈ హఠాత్పరిణామానికి స్టేషన్లో ఉన్న ప్రయాణికులు షాకయ్యారు.ట్రాక్‌పై ఉన్న బాలిక పరిస్థితి ఏంటని అందరూ కన్నురెప్ప వేయకుండా అటువైపు వెళ్లి చూడసాగారు. గూడ్సు రైలు వెళ్లగానే అక్కడ అద్భుతం జరిగింది. ట్రాక్ మధ్యలో ఉన్న అమ్మాయి లేచి నిల్చుంది. ఏలాంటి గాయం కాలేదు. క్షేమంగా ఉంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు దిగి ఆ అమ్మాయిని ప్లాట్ ఫామ్‌పైకి చేర్చారు. కాగా ఈ అమ్మాయి ఎవరు? ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది? ప్రమాదానికి కారణమేమి వంటి వివరాలు తెలియరాలేదు. అక్కడున్న ప్రత్యక్షి సాక్షి ఈ దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేయగా యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more