అమ్మాయిల కోసం సపరేట్ వాట్సాప్ గ్రూప్.. ఆపై ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్ youth arrested for morphing photos black mailing.

Jagityal teen arrested for black mailing girls

Jagityal Teen, Fake Whats App Group, Morphing Photos, Jagityal Youth Arrested, Sandeep kapadi, Sandeep kapadi Black Mail, Whats App Group, Morphing Photos, Friendship Blackmail

Jagityal teen arrested for cheating girls. Creating whats app group and black mailing with their morphing photos.

వాట్సాప్ లో మార్ఫింగ్ ఫోటోలు.. జల్సా లైఫ్

Posted: 02/18/2017 11:23 AM IST
Jagityal teen arrested for black mailing girls

స్నేహం పేరుతో యువతులను ట్రాప్ చేయటం, వారితో సన్నిహితంగా ఉండి బ్లాక్ మెయిలింగ్ కు దిగటం లాంటి వ్యవహారాలు కొత్తేం కాదు. కానీ నిండా పాతికేళ్లు లేని ఓ కుర్రాడు ఏకంగా 15 మంది అమ్మాయిలను మోసం చేయటం ఇక్కడ కొసమెరుపు. తనకున్న టాలెంటులు అన్ని ఉపయోగించిన ఆ కుర్రాడు వాళ్లను, ఎలా ట్రాప్ చేశాడు, లక్షలు ఎలా సంపాదించాడు అన్నది తెలుసుకుంటే ఎవరైనా అవాక్కవ్వటం ఖాయం.

జగిత్యాల జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన వంశీకృష్ణ 9వ తరగతి దాకా చదివి, ఆపై హైదరాబాద్ లో మల్లీ మీడియా చేశాడు. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచి తనతో పాటు చదువుకున్న అమ్మాయిలను మళ్లీ కదిలించటం ప్రారంభించాడు. వారందరితో కలిపి ఓ వాట్సాప్ గ్రూప్ ను ప్రారంభించిన వంశీ. నెమ్మదిగా వాళ్ల స్నేహితులను కూడా ఆ గ్రూప్ లోకి లాగాడు. ఒక్కోక్కరిని టార్గెట్ చేస్తూ వాళ్లతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగాడు. ఆ సమయంలో ఫోటోలు కూడా తీసుకున్నాడు.

Jagityal Youth Arrested

ఇక తనకున్న పరిజ్నానం ను ఉపయోగించి వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించసాగాడు. ఒక్కోక్కరి దగ్గరి నుంచి వేల సొమ్మును రాబట్టి దాంతో గోవా, హైదరాబాద్ లలో ఎంజాయ్ చేశాడు. చివరకు అతని వేధింపులు తట్టుకోలేని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ నవమన్మథుడి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వంశీ కాస్ట్ లీ లైఫ్ అంటూ కలరింగ్ ఇచ్చి అమ్మాయిలను ట్రాప్ చేసే వాడని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jagityal  Sandeep Kapadi  Black Mail  Morphing photos  Arrest  

Other Articles