మహాద్భుతం కక్ష్యలోకి ఉపగ్రహాల ప్రవేశం.. పీఎస్ఎల్వీ సెల్పీ వీడియో WATCH ISRO rocket launches104 satellites into space

Spectacular footage of isro s record pslv launch and separation of satellites

Indian Indian Space Research Organisation, ISRO, ISRO selfie video, Onboard camera video, Cartosat-2 series, PSLV-C37 launch, Satellites launch, Sriharikota,

The Indian Indian Space Research Organisation (ISRO) has released a spectacular selfie footage of its historic launch of 104 satellites captured by the onboard camera of PSLV-C-37 rocket.

ITEMVIDEOS: మహాద్భుతం కక్ష్యలోకి ఉపగ్రహాల ప్రవేశం.. పీఎస్ఎల్వీ సెల్పీ వీడియో

Posted: 02/17/2017 01:56 PM IST
Spectacular footage of isro s record pslv launch and separation of satellites

ప్రపంచ దేశాలను వెనక్కి నెడుతూ.. వేనోళ్ల కీర్తంపబడుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాధించిన అరుదైన ఫీటు ఒకేసారి 104 ఉపగ్రహాలను మోసుకెళ్లి.. వాటన్నింటినీ సురక్షితంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం. ఇక్కడ చెప్పకోవాల్సిన మరో విషయమేమిటంటే.. 104 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లడానికి మన శాస్త్రవేత్తలు చేస్తున్న ఖర్చు కూడా అత్యంత తక్కువ. ఈ అంశాలను మళ్లీ ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న మీ ప్రశ్నలకు సమాధనం మాత్రం ఇదికాదు. అయితే కక్ష్యలోనికి ఉపగ్రహాలను పోలార్ లాంచ్ శాటిటైట్ వెహికల్ ఎలా ప్రవేశపెటుతుంది..? అన్న ప్రశ్నలకు మాత్రం ఎప్పుడ్నించో సమాధానం వస్తుంది. అయితే తొలిసారిగా సాక్ష్యం లభించింది.  

రికార్డు స్థాయిలో చేపట్టిన 104 ఉపగ్రహాల ప్రయోగాన్ని తొలిసారి పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ వీడియో తీసింది. పీఎస్ఎల్వీ సీ 37కి అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా ఈ మొత్తం ప్రయోగాన్ని రికార్డు చేసింది. ప్రయోగం అనంతరం తొలి 18 నిమిషాల్లో భారత్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ నింగిలోకి ప్రవేశపెట్టింది. అనంతరం మరో పది నిమిషాల్లో మిగతా 101 నానో శాటిలైట్స్‌ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సీ 37 తీసిన ఈ సెల్ఫీ వీడియోను ఇస్రో విడుదల చేయగా, అవి కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pslvc37  World Record  Isro  Rocket  Space  pslvc37 selfie video  

Other Articles