అన్నాడీఎంకే పక్ష నేతగా నమ్మకస్తుడి ఎంపీకలో బిజీగా శశికళ sasikala busy in selecting her loyalist as party general secretary

Sasikala busy in selecting her loyalist as party general secretary

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, pallaniswamy, sendigottanyan, thambidurai, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

AIADMK general secretary VK Sasikala suffered a major jolt with the Supreme Court upholding the trial court's judgment, she is busy in selecting her loyalist as party general secretary at goden bay resort.

అన్నాడీఎంకే పక్ష నేతగా నమ్మకస్తుడి ఎంపీకలో బిజీగా శశికళ

Posted: 02/14/2017 11:45 AM IST
Sasikala busy in selecting her loyalist as party general secretary

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న కలలు గన్న స్వర్గీయ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళకు ఇక ఆ పదవి అందని ద్రాక్ష అని తేలిపోయన నేపథ్యంలో అమె ఎలాంటి అగుడులు వేయనున్నారు. పార్టీపై తన అదిపత్యాన్ని ఎలా చాటుకోనున్నారు.? తన వర్గం ఎమ్మెల్యేలను ఎలా ఐక్యంగా వుంచనున్నారు..? అమె జైలుకు వెళ్లిన తరుణంలో అమె శిబిరంలో నుంచి ఎమ్మెల్యేలు వలసలు పోకుండా ఎలాంటి వ్యూహాలను రచిస్తున్నారు అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో శశికళ తన అరెస్టు తప్పదని భావించి.. వెనువెంటనే ప్రత్యామ్నాయ చర్యల కోసం పార్టీ సీనియర్ నేతల సెంగొట్టయ్యన్, పళనిస్వామి, తంబిదురైలతో చర్చలు జరిపారు. అయితే తనకు నమ్మకస్తుడైన పళనిస్వామిని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు శశికళ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరో సీనియర్ నేత సంగొట్టయన్ కూడా సీఎం సీటుపై అసక్తిని కనబరుస్తున్నారని, అయితే అతనికి ఇప్పటికే అన్నాడీఎంకే ప్రిసీడియంగా నియవించిన నేపథ్యంలో అతన్ని చల్లబర్చే అవకాశం వుందని, తెలుస్తుంది.

21 ఏళ్ల క్రితం నాటి అక్రమాస్థుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వికే శశికళను అత్యున్నత న్యాయస్థానం దోషిగా తేల్చి నాలుగేళ్ల కారగారవాసంతో పాటు జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు మూడున్నరేళ్ల పాటు అమె పార్టీ పదవులకు దూరం కావడంతో పాటు ముఖ్యమంత్రి కావాలని ఆశలు పెట్టుకున్న అమెకు.. ఆ పదవి దాదాపుగా పదేళ్ల పాటు దూరం కానుంది. ఈ నేపథ్యంలో అమె తన నమ్మకస్తుడైన వ్యక్తితో పార్టీని నడిపించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా గోల్గన్ బే రిసార్టులో వున్న అమె తన వర్గం నేతను ఎంపిక చేయడంలో తనమునకలై వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  disproportionate case  pallaniswamy  sendigottanyan  thambidurai  AIADMK  

Other Articles