గణితంలో రాణిస్తే.. ఆ తీరాలను చేరడం ఈజీ..! Kids who enjoy maths have higher academic achievements

Kids who enjoy maths have higher academic achievements

mathematics, germany, ludwig maximilians university, maths, cognitive ability, students, survey, kids do well in school, good scores, children achivements, scientists

Children who enjoy studying mathematics and take pride in good scores are more likely to have higher academic achievements, say scientists

గణితంలో రాణిస్తే.. ఆ తీరాలను చేరడం ఈజీ..!

Posted: 02/12/2017 09:41 AM IST
Kids who enjoy maths have higher academic achievements

గణితంలో రాణించిన వారు ఖచ్చితంగా విజయతీరాలను అందుకుంటారని, వారిలో ఆ తీరాలను అందుకోవాలన్న తపన, ఉత్సుకత అధికంగా వుంటుందని సర్వే తేల్చింది. గణితాన్ని ఎక్కువగా ఇష్టపడటంతోపాటు మంచి మార్కులు సాధించిన విద్యార్థులు విద్యారంగంలో ఉన్న స్థానాలను పొందుతారని సర్వే స్ఫస్టం చేస్తుంది. గణితాన్ని నేర్చుకోవడంలో అనుకూల భావాలు కలిగిఉండడం, విజయం సాధించడమనేవి ఒకదానికొకటి అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే విద్యార్థులు చదివే విధానం, మేథో వికాసం అనేవి ఆనందం, ఆందోళన, విసుగుదల లాంటి భావోద్వేగ స్పందనల ద్వారా ప్రభావితమవుతాయని కనుగొన్నారు.

విజయ సాధనలో పాఠశాల స్థాయిలో విద్యార్థుల భావోద్వేగాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే అంశంపై జర్మనీలోని లుడ్విగ్‌ మాక్సిమిలియన్స్‌ విశ్వవిద్యాలయాని(ఎల్‌ఎమ్‌యూ)కి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. ‘‘విద్యార్థులకు ఎక్కువ తెలివితేటలు కలిగి, మంచి గ్రేడ్లు, మార్కులు సాధించినప్పటికీ.. గణితాన్ని ఎక్కువగా ఇష్టపడి చదివినవారే గొప్ప లక్ష్యాలను సాధించగలరు’’అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎల్‌ఎమ్‌యూ ప్రొఫెసర్‌ రెయిన్హార్డ్‌ పెక్రుమ్‌ పేర్కొన్నారు. అదే సమయంలో కోపం, ఆందోళన, సిగ్గు, విసుగు, నిరాశ కలిగిన విద్యార్థులు వారి లక్ష్యాలను సాధించుకోవడంలో వెనకబడతారని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mathematics  germany  ludwig maximilians university  maths  cognitive ability  survey  

Other Articles