దూసుకెళ్తున్న యువనేతలు.. జోష్ అందిస్తున్న పాటలు.. Victory songs, loud cheers at Rahul-Akhilesh’s first joint campaign

Victory songs loud cheers at rahul akhilesh s first joint campaign

Rahul Gandhi, Akhilesh Yadav, Congress SP alliance, UP Vijay Rath, UP polls, UP assembly elections-2017, bollywood songs, hit songs in campaign

Amid loud cheers from supporters and a ‘victory song’ blaring on loudspeakers, Congress vice-president Rahul Gandhi and UP chief minister Akhilesh Yadav held the ‘UP Vijay Rath’ yatra

దూసుకెళ్తున్న యువనేతలు.. జోష్ అందిస్తున్న పాటలు..

Posted: 02/11/2017 04:58 PM IST
Victory songs loud cheers at rahul akhilesh s first joint campaign

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యర్థులకు భిన్నంగా తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్న యువనేతలు తమ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, శ్రేయోభిలాషులకు కూడా అదే క్రమంలో జోష్ పెంచాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎప్పటినుంచే వస్తున్న అనవాయితీనే వారు కూడా వాడుకుంటున్నారు. భారతీయ ఓటర్లకు ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లకు గాలం వేసేందుకు తాజాగా హిట్ సినిమాలను తమ ప్రచారంలో భాగంగా వినియోగిస్తుండటంలో పార్టీ క్యాడర్ కూడా జోష్ గా పనిచేస్తుందంటున్నాయి పార్టీ వర్గాలు

పాటలంటే సహజంగానే అందరకీ ఇష్టమని.. ఆ ఇష్టాన్ని తమవైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాటలనే ఆయుధంగా చేసుకోని ఎన్నికల ప్రచారాన్ని అదరగొడుతున్నారు. పార్టీ బహిరంగ సభలు, ర్యాలీలతో పాటు వారు వెళ్లే ప్రతీ చోట.. దీంతో పాటు తమ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ప్రతీ చోట ఈ పాటలనే అయుధంగా మలచి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇందుకోసం బాలీవుడ్ పాటల రచయితలను కూడా రంగంలోకి దింపేశారు.

 ‘యే దిల్‌ హై ముష్కిల్‌’లో హిట్‌ పాటలు పాడిన అమిత్‌ మిశ్రాతో ఎన్నికల ప్రచారం టైటిల్‌ సాంగ్‌ ‘యే హు నా బాత్‌’ పాడించారు. ‘తను వెడ్స్‌ మను’ సినిమాకు పాటలు రాసిన రాజశేఖర్‌తో ఈ టైటిల్‌ సాంగ్‌ను రాయించారు. ఎందుకు వీరిద్దరు కలిశారు? వీళ్లను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షానికి ఎందుకు కష్టం అంటూ సాగే వీడియో పాటలో ఒకే వేదికపై రాహుల్, అఖిలేష్‌ చేతులు కలుపుకోవడం, ప్రజలకు అభివాదం చేయడం, సభలకు హాజరైన అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించడం లాంటి చిత్రాలను జోడించారు. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘సుల్తాన్‌’ సినిమాలోని ‘బేబీ కో బస్‌ పసంద్‌ హై’ పాటను స్ఫూర్తిగా తీసుకొని రాసిన మరో పాట‘సైకిల్‌ కో హాత్‌ పసంద్‌ హై, యూపీ కో ఏ సాత్‌ పసంద్‌ హై’ను  కూడా ఎన్నికల ప్రచారంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

ఇప్పుడు ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇంతకుముందు ‘యూపీకో అఖిలేష్‌ పసంద్‌ హై’ అంటూ పాట కొనసాగగా ఇప్పుడు దానికి రాహుల్‌ కాంబినేషన్‌ను కలిపారు. మొదటి నుంచి కూడా సమాజ్‌వాది పార్టీ పాటల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించేది. గతంలో ‘మన్‌సే హై ములాయం’ అనే పాట బహుళ ప్రాచుర్యం పొందింది. ‘వియ్‌ డిడంట్‌ స్టార్ట్‌ ది ఫైర్‌’ అనే బిల్లి జోయల్‌ పాడిన పాటను స్ఫూర్తిగా తీసుకొని ఆ పాటను రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles