బాత్ రూంలలోకి తొంగిచూటడం.. ప్రధానికి అలవాటు.. Modi likes peeping into bathrooms, not doing his job: Rahul Gandhi

Modi likes peeping into bathrooms not doing his job rahul gandhi

Rahul Gandhi, Akhilesh Yadav, Narendra modi, bathroom remark, Samajwadi Party-Congress alliance, Uttar Pradesh elections, UP polls 2017, UP elections 2017

Taking a swipe at Narendra Modi for his "raincoat in bathroom" barb at Manmohan Singh, Congress leader Rahul Gandhi said the PM was more interested in "peeping into bathrooms of people".

బాత్ రూంలలోకి తొంగిచూటడం.. ప్రధానికి అలవాటు..

Posted: 02/11/2017 11:29 AM IST
Modi likes peeping into bathrooms not doing his job rahul gandhi

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన అనుచిత వ్యాఖలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెయిన్ కోట్ వేసుకుని బాత్రూంలో స్నానం చేస్తారన్న మోదీ వ్యాఖ్యలకు ఆయన ధీటుగా బదులిచ్చారు. దేశ ప్రధానిగా ప్రజలకు ఏలాంటి పథకాలు తీసుకురావాలని అలోచనలు బదులుగా.. ప్రధాని మోడీ దేశప్రజల బాత్రూంలలోకి తొంగిచూస్తున్నారని.. వారు బాత్ రూంలలో ఎలా స్నానాలు ఆచరిస్తున్నారో తెలుసుకుంటున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ బాత్ రూంలోకే తొంగిచూశారని దుయ్యబట్టారు.

లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి కామన్ మినిమమ్ ప్రోగ్రాం పేరిట పది అంశాలతో కూడిన ఎజెండాను విడుదల చేశారు. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రమైన  వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఇక ఉన్నది రెండున్నరేళ్లేనని, ఆయన జాతకం బయటపెడతానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో తాము ఏం చేస్తామని ఎవరైనా ప్రచారం చేస్తారు కానీ.. ప్రధాని మాత్రం మా పోత్తు గురించే మాట్లాడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో తమ కూటమి విజయం సాధిస్తుందన్న విషయం తెలిసి మోడీని నిద్రకరువైందన్నారు. అందుకనే తమ పోత్తుపై కూడా అయన విమర్శల చేసే స్థాయికి ఆయన దిగజారుతున్నారని దుయ్యబట్టారు.

ప్రధానమంత్రిని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానాలు చెప్పలేకపోతే తన అసహనాన్ని ఎదుటివారిపై విరుచుకుపడి ప్రదర్శిస్తారని అన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో మోదీ దారుణంగా విఫలమయ్యారని రాహుల్ చెప్పారు. 99 శాతం సీట్లు సాధించుకోడానికే ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు. మోడీ పాలన ప్రారంభమై రెండున్నరేళ్లు దాటినా..  దేశ ప్రజలు ఇప్పటికీ అచ్ఛేదిన్ కోసం ఎదురు చూస్తున్నారని, కొంతమంది మన్‌కీ బాత్ చెబుతున్నారు గానీ కామ్‌ కీ బాత్ చెప్పడం లేదని అఖిలేష్ అన్నారు. ఇవి ఎన్నికలని.. ఎవరూ భావోద్వేగాలకు, కోపానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles