అమెరికాలో పవన్ కలిసిన ఈ ప్రోఫెసర్ మాములోడు కాదు! | Pawan meet International political strategist.

Pawan kalyan meets prof steve jarding

Professor Steven Jarding, Professor Steven Jarding Pawan kalyan, Professor Steven Jarding Jansena, Professor Steven Jarding AP Politics, Janasena chief Pawan Kalyan, Professor Steven Jarding, Pawan kalyan Harvard Professor, International political strategist Pawan kalyan, International Political Strategist Janasena, International Political Strategist, Pawan kalyan America Tour, pawan kalyan Meet

Janasena chief Pawan Kalyan had a closed room 2 hour meeting with Professor Steven Jarding, who working as Professor in Harvard University and also International Political Strategist.

ఇంటర్నేషనల్ సలహాదారునితో పవన్ భేటీ!

Posted: 02/10/2017 03:58 PM IST
Pawan kalyan meets prof steve jarding

హార్వర్డ్ యూనివర్శిటీ ప్రసంగం కోసం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూనివర్శిటీలో ప్రొఫెసర్ స్టీవెన్ జార్డింగ్ తో ఆయన దాదాపు రెండు గంటల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇంతకీ ఆయన ప్రత్యేకత ఏంటో తెలుసా? హార్వర్డ్ విశ్వవిద్యాలయం లోని కెనెడీ స్కూల్ లో ఓ ప్రొఫెసర్ ఈ జార్డింగ్. అంతేకాదు ఆయనో పొలిటికల్ అడ్వైజర్ కూడా.

పబ్లిక్ పాలసీ, ఎన్నికల్లో ఎలాంటి ప్యూహాలు అనుసరించాలి తదితరాలను రూపొందించటంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. అమెరికాలో పలువురు రాజకీయ వేత్తలు ఆయన సలహాలనే పాటిస్తుంటారు. ఒకప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అల్ గోర్ - అమెరికన్ నేతలు జాన్ కెర్రీ వంటివారూ జార్డింగ్ క్లయింట్లే. అలాంటి వ్యక్తిని పవన్ కలుసుకున్నాడన్న మాట. బోస్టన్ లోని చార్లెస్ హోటల్ లో వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. అల్రెడీ ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన జార్డింగ్ వచ్చే ఎన్నిక‌ల్లో ఎటువంటి ఎత్తుగడలు అవలంభించాలి, అభ్యర్థుల ఎంపిక ఎలా చేయాలి అన్న వివరాలను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వివరించినట్లు సమాచారం. వీలైతే ఎన్నికల ముందు మరోసారి వీరి భేటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు వీరిద్దరూ భేటీ అయినప్పుడు తీసిన ఫొటోను కూడా అప్ లోడ్ చేసింది. అన్నట్లు యూపీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత అయిన అఖిలేష్ యాదవ్ కు ప్రొఫెసర్ స్టీవెన్ శిష్యడు అద్వైత్ విక్రమ్ సింగ్ సలహాదారుడిగా పని చేస్తున్నాడు. అయితే ఏపీలాంటి క్లిష్టమైన పొలిటిక్ ఫ్లోర్ పై జార్డింగ్ సలహాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయన్నది అనుమానమే. పైగా జార్డింగ్ ట్రాక్ లో హిల్లరీ క్లింటన్ ఓడిపోవటం అనే మచ్చ కూడా ఉంది.

Pawan kalyan Meet Professor Jarding

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles