ఆయన ఎందుకలా చేస్తున్నాడు... శశికళపై అంత పగ ఎందుకు? | TN Governor C Vidyasagar Rao unhappy with Sasikala.

Subramanian swamy comments on tn governor vidyasagar rao

Tamil Nadu Governor, MP Subramanian Swamy, Ch Vidyasagar Rao , Ch Vidyasagar Rao Subramanian Swamy, Ch Vidyasagar Rao VK Sasikala, Sasikala Natarajan, Vidyasagar Raom Tanil Nadu President Rule

Tamil Nadu governor Ch Vidyasagar Rao of flouting the Constitution and convention by not administering oath of office to the newly elected Tamil Nadu Chief Minister VK Sasikala Natarajan. BJP MP Subramanian Swamy says Is Governor unhappy with Sasikala taking over as Tamil Nadu CM?

తమిళనాడు గవర్నర్ పై సంచలన వ్యాఖ్యలు

Posted: 02/08/2017 09:49 AM IST
Subramanian swamy comments on tn governor vidyasagar rao

తమిళనాడు గవర్నర్(ఇన్ ఛార్జీ) విద్యాసాగర్‌రావుపై సొంత పార్టీ నేత బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పూర్తి మద్ధతు ఉండి కూడా ముఖ్యమంత్రిగా శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం అనవసరమంటూ ఆయన వ్యాఖ్యానించాడు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళకు అపారమైన భక్తిశ్రద్ధలు ఉన్నాయని, ఆమె మంచి హిందూ మహిళ అని పేర్కొన్నారు. గురువారం లేదా ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెబుతున్నాడు.

సీఎం పీఠం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తి శశికళ అని గవర్నర్ గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగతంగా ఆమె నచ్చినా, నచ్చకున్నా ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో గవర్నర్‌ను కేంద్రం వివరణ అడగాలని డిమాండ్ చేయటం విశేషం.

మరోవైపు శశికళ అండ్ కో కు ఓ శుభవార్త అందింది. గవర్నర్ విద్యాసాగర్‌రావు నేడో రేపో చెన్నై రానున్నారన్న సమాచారం అందింది. రెండు రోజుల విశ్రాంతి కోసం కుటుంబంతో కలిసి ఊటీ వెళ్లిన గవర్నర్ విద్యాసాగర్‌రావు పన్నీర్ రాజీనామా విషయం తెలిసి అటునుంచి అటే ఢిల్లీ వెళ్లారు. ఆపై అక్రమాస్తుల కేసులో శశికళపై వచ్చేవారం సుప్రీం తీర్పు ఉన్నందున న్యాయ నిపుణుల సూచనలు, కేంద్రంతో మాట్లాడిన అనంతరం ఆయన చెన్నై వస్తారని అందరూ భావించారు.

అయితే ఢిల్లీ నుంచి నేరుగా ఆయన ముంబై వెళ్లడంతో శశికళ వర్గానికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఓ వైపు రాష్ట్రం రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంటే గవర్నర్ ఇలా తీరిగ్గా వ్యవహరించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన గవర్నర్ నేడు(బుధవారం), లేదా గురువారం ఉదయం చెన్నై రానున్నట్టు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఉదయం 10 గంటలకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ తర్వాత శశికళను సీఎం చేయాలంటూ లేఖ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో ఆయన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని రాజ్ భవన్ కే పరిమితమౌతారన్న వార్త కాసేపటికే వెలువడటం విశేషం.

పరిస్థితులను వాడుకుంటాం.. స్టాలిన్

కాగా, రాజకీయ సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితులకు తామే కారణమంటూ శశికళ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించాడు. పన్నీర్ సెల్వంతో తామెప్పుడు రాయబారం నడపలేదని, బహుశా ఈ విషయంలో కేంద్రం జోక్యం ఉండి ఉండొచ్చని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అన్నాడీఎంకేలో చీలికలు వచ్చి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుందని, అదే జరిగితే ఆ పరిస్థితిని వాడుకుంటామని ఆయన వివరించాడు. ఇక మరోవైపు డీఎంకే తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పన్నీర్ సెల్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అమ్మ మృతికి సంబంధించి 10 శాతం మాత్రమే తాను మాట్లాడానని, మిగతా 90 శాతం మాట్లాడితే బాగోదన్న సెల్వం వ్యాఖ్యలు ప్రకపంనలు పుట్టిస్తున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CH Vidyasagar Rao  Tamil Nadu Governor  VK Sasikala Natarajan  

Other Articles