రికార్డ్ డాన్సర్ తో స్టేజీపైనే పోలీస్ రొమాన్స్. ముద్దులు.. ఆపై | Kumpinipuram ASI Recording Dance.

Asi recording dance in kumpinipuram

ASI Recording Dance, Kumpinipuram Festival, Kumpinipuram Recording Dance, Assistant Sub Inspector Recording Dance, YSR Cuddapah Recording Dance, Police Officer Recording Dance Video, Kumpinipuram Village

Police Supports Recording Dance In Kumpinipuram Village. ASI kiss and Hug recording Dancer, Video Viral. ASI Recording Dance in Kumpinipuram.

ITEMVIDEOS:రికార్డింగ్ డాన్సర్ తో పోలీసాఫీసర్ రొమాన్స్

Posted: 02/06/2017 08:34 AM IST
Asi recording dance in kumpinipuram

రికార్డింగ్ డాన్సుల పేరిట అశ్లీల నృత్యాలు తరచూ జరుగుతుండటం తెలిసిందే. స్వయంగా ప్రజా ప్రతినిధులే దగ్గరుండి మరీ ఈ యవ్వారాలను జరిపించటమే కాదు, అందులో హుషారుగా రెచ్చిపోతుంటారు కూడా. ఇలాంటి వ్యవహారాలు నేతలకు కొత్తేం కాకపోయినా, ఇక్కడ ఓ ఖాకీ పెద్దాయన చేయటంతో పెద్ద దుమారమే రేగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐ జాతరలో డాన్సర్సలతో చెలరేగిపోయిన విషయం విమర్శలకు దారితీస్తోంది.

నందలూరు మండలం కుంపిణీపురంలో శుక్రవారం రాత్రి జరిగిన జాతరలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డ్యాన్సర్లతో ప్రోగ్రాం నిర్వహించారు కూడా. అక్కడే ఉన్న ఓ ఏఎస్సై వారితో కలసి రెచ్చిపోయి చిందులేశాడు. మైక్ అందుకుని పాటపాడుతూ... ఓ మహిళను ముద్దాడాడు. ఈ దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. గతంలో పుణ్యక్షేత్రమైన కుంపిణీపురంలో అసభ్యకరమైన నృత్యాలు జరుగుతాయని డీఎస్పీ మొదలుకుని జిల్లా ఎస్పీ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విషయంను సీరియస్‌ గా తీసుకున్న అధికారులు అశ్లీల నృత్యాలకు అనుమతి ఇవ్వొద్దంటూ గతంలోనే ఆదేశాలిచ్చారు.

 

అయితే నెల్లూరు నుంచి ఓ నృత్యబృందంచే కార్యక్రమం నిర్వహించేందుకు రూ.1లక్షకు ఒప్పందం కుదర్చుకొని కుంపిణీపురానికి తీసుకువచ్చినట్లుగా తెలిసింది. ఈ నృత్య బృందంలోని మహిళతో కలిసి డిస్కో డాన్సర్ లా చెలరేగిపోయిన ఏఎస్‌ఐ .. పైగా మహిళతో ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSR Cuddapah  Kumpinipuram Festival  Recording Dance  ASI  

Other Articles