ఎమ్మెల్యేలు సరే.. ప్రజలు అంగీకరిస్తారా..?: దీపా sasikalt elevation as cm is akin to army coup: Deepa

Sasikalt elevation as cm is akin to army coup deepa

tamil nadu, paneer selvam, sasikala, chief minister, vidyasagar rao, cabiner minister, deepa jayakumar, tamil nadu politics

Late Tamil Nadu Chief Minister Jayalalithaa’s niece Deepa Jayakumar states that “Her taking up the get together is akin to a army coup since she just isn’t an elected consultant,”

ఎమ్మెల్యేలు సరే.. ప్రజలు అంగీకరిస్తారా..?: దీపా

Posted: 02/05/2017 01:29 PM IST
Sasikalt elevation as cm is akin to army coup deepa

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారని వస్తున్న కథనాలపై జయలలిత మేనకోడలు దీపాకుమార్‌ స్పందించారు. 'ఇండియా టుడే'తో మాట్లాడిన ఆమె శశికళ తీరు సైనిక కుట్రను తలపిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నవారిని మార్చి తాను అకస్మాత్తుగా పగ్గాలు చేపడితే.. దానిని ప్రజలు ఒప్పుకోబోరని ఆమె పేర్కొన్నారు. సీఎం పన్నీర్‌ సెల్వాన్ని గద్దె దించి శశికళ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారని, ఇందుకోసమే ఆదివారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కీలక భేటీ నిర్వహించబోతున్నారని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కథనాలపై దీప స్పందించారు. ఈ విషయంలో పలు కథనాలు వస్తున్నాయని, అయినా అన్నాడీఎంకే తుది నిర్ణయం తీసుకునేవరకు వేచిచూడటం మంచిదని చెప్పారు. సీఎంగా శశికళ పగ్గాలు చేపట్టబోతున్నారన్న వార్తలపై స్పందిస్తూ.. 'ఇలా జరగాలని ప్రజలు కోరుకోవడం లేదు. తమిళనాడు ప్రజలకు అంతతి దుస్థితి వస్తుందని నేను కూడా అనుకోవడం లేదు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ప్రభుత్వాన్ని సైనిక కుట్రతో కూల్చడం లాంటిదే. ఆమె ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన నేత కాదు' అంటూ పేర్కొన్నారు. జయలలిత సలహాదారు అయిన షీలాబాలకృష్ణన్‌ ను పక్కా ప్లాన్‌తోనే పదవి నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు.

మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా వీకే శశికళ ప్రమాణ స్వీకారం చేస్తే, రాష్ట్రానికి అంతకన్నా అసహ్యకరమైనది మరొకటి ఉండదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. "శశికళ సీఎంగా అవకుండా చేయడానికి ఎలాంటి నిషేధమూ లేదు. అయితే, ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. ఆమెపై సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఉంది. ఓ నిందితురాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమేంటి? రాష్ట్రానికి మళ్లీ ఎన్నికలు వచ్చేలోగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో పదవిని చేపట్టడం రాష్ట్రానికి మంచిది కాదు" అని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles