అమ్మ స్థానంలో చిన్నమ్మ.. ఇక సీఎం పగ్గాలు కూడానా.? Is Chinnamma Sasikala Taking Over As Tamil Nadu CM?

Is chinnamma sasikala taking over as tamil nadu cm

Jayalalithaa, vidyasagar rao, governor, tamil nadu AIADMK, Jayalalithaa, sasikala natarajan, o paneerselvam, TN chief minister, aiadmk, chennai, tamil nadu

A change of guard seems to be in the offing as a section of ruling AIADMK MLAs are likely to urge Chinnamma Sasikala, a close aide of late Jayalalithaa, to take over the reins of the government at a meeting to be held on Sunday.

అమ్మ స్థానంలో చిన్నమ్మ.. ఇక సీఎం పగ్గాలు కూడానా.?

Posted: 02/04/2017 01:25 PM IST
Is chinnamma sasikala taking over as tamil nadu cm

తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిశ్చెలి శశికళ నటరాజ్ ముఖ్యమంత్రి పగ్గాలను కూడా అందుకునేందుకు అనువుగా పావులను శరవేగంగా కదుపుతున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వీకే శశికళ.. తాజాగా సీఎం పీఠాన్ని కూడా అధిరోహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. దీంతో పార్టీ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించడమే తరువాయి. ఆ తరువాత ఇక పార్టీలో జయలలిత కొనసాగిన రెండు పదవులను చిన్నమ్మ చేపట్టేందుకు గ్రౌండ్ వర్క్ అంతా సిద్దమైపోయింది.

జయలలిత మరణానంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌సెల్వం స్థానంలో... ఈ నెల 8 లేదా 9న శశికళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు అటు సోషల్ మీడియా ఇటు తమిళ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం జరగనుందని, ఈ భేటీలో శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ ద్వారా ముఖ్యమంత్రి పదవిని శశికళ చేపట్టవచ్చునని ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తన సీఎం పీఠానికి ఎసరు రాకుండా పన్నీర్‌ సెల్వం కూడా తన వర్గీయులతో దీటుగా వ్యూహాలు రచిస్తున్నట్టు వినిపిస్తోంది.

ఊహించని షాక్...

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం పావులు కదుపుతున్న శశికళకు ఊహించని షాక్ తగిలింది. అందుకోసం పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ‌శిక‌ళ‌ ఎన్నిక చెల్లదంటూ పార్టీ బహిష్కృత ఎంపీ శ‌శిక‌ళ‌ పుష్ప చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆ పార్టీకి ఆదేశాలు జారీ చేసింది. మ‌రోవైపు జయలలిత మ‌ర‌ణంపై అనుమానం వ్య‌క్తం చేస్తూ, సీబీఐతో విచారణ చేయించాలని శ‌శిక‌ళ‌ పుష్ప వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగ‌తి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  sasikala natarajan  o paneerselvam  TN chief minister  aiadmk  chennai  tamil nadu  

Other Articles