ఎన్నికల వేళ.. ప్రధానిపై నోరుజారుతున్న ముఖ్యమంత్రి Cancel AAP's party status for filing false audits says IT dept

Narendra modi trying to get aap de registered alleges arvind kejriwal

arvind kejriwal, derecognition of AAP, Election Commission of India, Income Tax department, Narendra Modi, shameless dictator, false audit reports

Delhi CM Arvind Kejriwal called PM Modi "a shameless dictator" after the IT Department sought derecognition of the AAP for allegedly filing "false and fabricated" audit reports on donations.

ఎన్నికల వేళ.. ప్రధానిపై నోరుజారుతున్న ముఖ్యమంత్రి

Posted: 02/03/2017 04:45 PM IST
Narendra modi trying to get aap de registered alleges arvind kejriwal

పంజాబ్‌, గోవాలలో మరికోన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న తరుణంలో అమ్ అద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ సేకరించిన విరాళాలపై తప్పుడు, కల్పిత అడిట్ రిపోర్టులు పోందుపర్చామని అరోపణలు చేసి పార్టీ గుర్తింపును రద్దు చేసేందుకు సిద్దమైందని అరోపించారు. శనివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం రోజున ఆమ్‌ ఆద్మీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్న ఆదాయపన్నుశాఖ రాసిన లేఖపై ఆయన స్పందించారు.

తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోనలేక అత్యంత నీచమైన స్థితికి బీజేపి దిగజారుతుందని మండిపడ్డారు. తమ పార్టీ సమర్పించిన విరాళాల జాబితాను పక్కన బెట్టి తప్పుడు, కల్పిన అడిట్ రిపోర్టులను బీజేపి పొందుపర్చిందని అరోపించారు. ఇంతటి హేయకరమైన చర్యకు పాల్పడుతున్న ప్రధాని నిసిగ్గు నియంత అని అభివర్ణించారు. తమ పార్టీని ఎదుర్కోనలేని నరేంద్రమోడీ అత్యంత నీచ కుయుక్తులకు, కుట్రలకు తెరతీస్తున్నారని మండపడ్డారు.

పంజాబ్, గోవాలలో బీజేపి తమ పార్టీ చేతిలో ఓటమి పాలవుతున్న విషయం అర్థమై, దానిని జీర్ణించుకోలేక సరిగ్గా ఎన్నికలకు 24 గంటల ముందు పార్టీని రద్దు చేయాలని చూస్తున్నారని అరోపించారు. ఆప్‌కు ఉన్న రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయాలని ఆదాయ శాఖ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతూ రాసిన లేఖను కూడా అప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.  రూ. 27 కోట్ల విరాళాల గురించి ఆప్‌ తప్పడు, కల్పిత ఆడిట్‌ నివేదికలను సమర్పించిందని, కాబట్టి దాని రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయాలని  ఈసీకి ఐటీ నివేదించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles