పెళ్లికి ముందే శృంగారం చేసిన జంటకు బడిత పూజ couple-caned-for-having-sex-outside-of-marriage-in-indonesia

Couple caned for having sex outside of marriage in indonesia

Indonesia, Banda Aceh, whip, cane, punish, marriage, sex, sex outside of marriage, illicit affair, police, public punishment, viral video

A couple were photographed screaming in pain as they were caned for having sex outside of marriage in Indonesia.

ITEMVIDEOS: పెళ్లి కాని జంటకు.. జింతాత జిత జిత జింతాత థ

Posted: 02/03/2017 02:46 PM IST
Couple caned for having sex outside of marriage in indonesia

పెళ్లికి ముందు శృంగారం అంటే మన దేశంలో రెండు విభిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఒకటి తప్పేంది అంటే రెండవ వర్గం వారు మాత్రం అది ముమ్మాటికీ తప్పే అని అంటున్నారు. దీనిపై చర్చపచర్చలు జరిగినా.. ఇక దీనిని ఎవరి ఇస్టం వారిదన్న మూడవ వాదనలు ఫుల్ స్టాప్ పెట్టాయి. అయితే ఇండోనేషియాలో మాత్రం పెళ్లికి ముందు శృంగారం చేసినా.. లేక వివాహితలు భర్తతో కాకుండా పర పురుషులతో శృంగారంలో పాల్గోన్న వారికి కఠిన శిక్షను విధిస్తారు. ఇది అక్కడి చట్టం.

ఇండోనేషిలాలోని ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి బహిరంగ శిక్షలు విధించడం..తద్వారా ఇతరులు అలాంటి చర్యలను ఉపక్రమించాలంటేనే భయం కల్పిస్తారు. అయినా ఎవరు తమను పట్టించుకుంటారులే.. అనుకున్న జంటలు మాత్రం బరితెగించి సుదూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ శృంగారంలో పాల్గొంటున్నాయి. అయితే ఇలాంటి వారు దొరకనంత వరకు సేఫ్.. దొరికితే మాత్రం బ్యాక్ బ్లాస్ అవ్వక తప్పదు. ఎందుకంటారా..? వారిని స్థానిక మసీదు వద్ద బ్యాక్ బ్లాస్ట్ అయ్యేట్లు చితకకొడతారు కాబట్టి.

ఆ మధ్య ఇలాంటి 16 జంటలను శిక్షించిన ఇండోనేషియా పోలీసులు.. తాజాగా అలాంటి చర్యలకే పాల్పడిన మరో జంటకు కూడా జింతాత జిత జిత జింతతథ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండోనేషియాలోని బండా ఎసె ప్రాంతానికి చెందిన మహిళకు అక్కడి ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం అధికారులు బెత్తం దెబ్బలను శిక్షగా విధించారు. ఈ శిక్ష అమలు సందర్భంగా సదరు మహిళ మొహాన్ని చేతులతో కప్పుకొని ఏడుస్తున్న తీరు పట్ల నెటీజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

జంటలోని ఇద్దరికీ ఒక్కోక్కరికి 26 దెబ్బలను శిక్షగా విధించారు. మసీదు వద్ద ప్రార్థనలు ముగియగానే పక్కనే ఏర్పాటు చేసిన ఓ వేదికపైకి జంటను తీసుకువచ్చారు. ముందుగా మహిళను తీసుకువచ్చి అమెకు శిక్షను అమలు చేశారు. ఆ దెబ్బలకు తాళలేక అమె ఓ వైపు విలపిస్తూనే మరోవైపు తన ముఖాన్ని కనిపించకుండా చేతులను అడ్డుపెట్టుకుంది. ఇక ఆ తరువాత వంతు యువకుడిది.. అతడ్ని తన పంటి కిందే తన బాధను బిగిపట్టుకున్న దృశలను ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles