పంజాబ్ లో అప్.. గోవాలో హంగ్..! నిజమేనా..? AAP set to win Punjab, hung Assembly in Goa

Aap set to win punjab hung assembly in goa

Assembly Elections 2017, Punjab election, Goa election, hung assembly, HuffPost-CVoter survey, Arvind Kejriwal, BJP, congress, shiromani-akalidal, Amarinder Singh, Parkash Singh Badal, The Huffington Post, CVoter, pre-poll survey, amit shah, Laxmi Kant Parsekar, Manohar Parrikar

AAP is poised to win 63 of the 117 seats in Punjab, and Akali-BJP combine's voteshare will get halved. Goa is likely to be a hung Assembly due to a neck-and-neck battle between the BJP and the Congress

పంజాబ్ లో అప్.. గోవాలో హంగ్..! నిజమేనా..?

Posted: 02/03/2017 12:25 PM IST
Aap set to win punjab hung assembly in goa

మరికొన్ని గంటల్లో ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్, గోవా రాష్ట్రాలలో ఎవరు గెలుస్తారు.. అధికార పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు..? గత రెండు పర్యాయాలుగా పంజాబ్ లో హవా కోనసాగించిన శిరోమణి అకాళిదళ్ దాని మిత్రపక్షమైన బీజేపి గెలుపోందుతాయా..? లేక అప్పటి నుంచి గెలుపు కోసం ఆరటపడుతున్న కాంగ్రెస్ విజయం సాధిస్తుందా..? కొత్తగా బరిలోకి వచ్చిన అప్ గెలుస్తుందా..? అన్న ఉత్కంఠ పార్టీ నేతలో వుంది. ఈ తరుణంలో హిఫింగ్టన్ పోస్ట్-సి ఓటర్ నిర్వహించిన ప్రీ ఫోల్ సర్వే పలు అసక్తికర విషయాలను ఇవాళ ప్రకటించింది.

ఈ సర్వే ప్రకారం పంజాబ్ లో కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన అమ్ అద్మీ పార్టీ గెలుపోందనున్నట్లు వెల్లడించింది. 117 స్థానాలు వున్న పంజాబ్ లో 59 స్థానాలు గెలుపొందిన పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోనుంది. అయితే అమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 63 స్థానాల్లో బలంగా వుందని ప్రకటించింది. అయితే ఇదే సమయంలో గోవాలో మాత్రం అప్ ఉనికి నామమాత్రంగానే వుందని ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు వున్నాయని సర్వే వెల్లడించింది.

పంజాబ్ లో అధికార శిరోమణి అకాళీదళ్ పార్టీకి ఈ సారి పరాభవం తప్పదని అంచనా వేసింది. 63 స్థానాల్లో బలంగా వున్న అప్ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోనుందని, ముఖ్యంగా మాల్వా ప్రాంతంలో అప్ పార్టీ దూసుకుపోతున్నట్లు తేలించని సర్వే వెల్లడించింది. కాగా ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంతో కేవలం 43 స్థానాలతో సరిపెట్టుకోనుండగా, అకాళీదల్-బీజేపి మిత్రపక్షానికి కేవలం 11 స్థానాలు మాత్రమే లభించనున్నట్లు సర్వే వెల్లడించింది. కాగా ఢి్ల్లీ తరువాత పంజాబ్ లో అప్ పార్టీ తమ అధిపత్యాన్ని పూర్తిస్థాయిలో కనబర్చనున్నట్లు సర్వే ఫలితాల అంచనా.

ఇక అటు గోవాలో మాత్రం త్రిముఖ పోటీతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు వున్నాయని సర్వే చెబుతుంది. అప్ పార్టీ అనుకున్న స్థాయిలో రాణించలేదని సర్వే తేల్చింది. అధికార బీజేపికి 15 స్థానాలను కైవసం చేసుకోనుందని, కాగా కాంగ్రెస్ 14 స్థానాలలో రాణించనున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఇక అప్ సహా ఇతర పార్టీలు 11 స్తానాలను గెలుపోందనున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్రమంత్రి మనోహర్ పారికర్ కన్నా లక్ష్మీకాంత్ పర్సేకర్ కే ఓటర్లు మొగ్గుచూపారు. అయితే పంజాబ్ లో మాత్రం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నా కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం కావాలని అధికశాతం మంది ఓటర్లు అభిలాశించారని సర్వే తేల్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly Elections 2017  Punjab election  Goa election  HuffPost-CVoter survey  AAP  BJP  congress  SAD  

Other Articles