రక్తమోడుతున్న యువకుడ్ని వీడియో తీశారు..! people took photos of teen, who bled to death on K’taka road

People took photos of teen who bled to death on k taka road

road accident, youth died, photos, public apathy, viral video, cyclist dead, people take videos, Hubballi, Hosapete,.bengaluru, karnataka, crime

In yet another incident of public apathy, an 18-year-old boy succumbed to injuries following a road accident in Karnataka's Koppal as onlookers clicked pictures of the bleeding victim instead of helping him.

ITEMVIDEOS: మానవత్వానికి పరాకాష్ట.. రక్తమోడుతున్న యువకుడ్ని వీడియో తీశారు..!

Posted: 02/02/2017 12:43 PM IST
People took photos of teen who bled to death on k taka road

‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడూ.. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడూ..’ అని జానపద గేయ రచయిత ఊరికే అనలేదు. ప్రస్తుత సమాజంలో మనుషులు కోల్పోతున్న నైతిక విలువలకు, మనుషుల్లో పెరుగుతున్న క్రూరత్వాన్ని ఎత్తిచూపుతున్న ఈ పాటకు అచ్చంగా అద్దంపట్టేలా కర్ణాటకలో గురువారం ఓ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం బారిన పడి రుధిర గాయాలతో అదుకునేవారి కోసం అర్థనాధాలు పెడుతున్న ఓ యువకుడ్ని కనీసం పట్టించుకున్న పాపన పోలేదు అక్కడి జనాలు.

అందివచ్చిన సాంకేతిక విప్లవంతో చేతిలో స్మార్ట్ మొబైల్ ను తీసి ఆదుకునేవారి కోసం చేయి చాచి అర్థిస్తున్నా.. అతడ్ని పట్టించుకోకుండా.. తమ మొబైల్ లో ప్రమాద ఘటనను చిత్రీకరించడం విస్మయాన్ని కలిగిస్తుంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో వున్న యువకడి ప్రాణాలను నిలుపుదామన్న ద్యాస లేదు.. అలా అని అగి, మరీ తమ ఫోన్ లో ఘటనను చిత్రీకరించుకుని వెళ్లడం మానవత్వం లేదన్న విషయానికి పరాకాష్టగా నిలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే..  18 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై.. రోడ్డుమీద రక్తం కారుతూ పడి ఉన్నా ఏ ఒక్కరూ అతడిని ఆస్పత్రికి తరలించలేదు.అతడు బాధతో విలవిల్లాడుతుంటే వీడియోలు తీసుకున్నారు.

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన అన్వర్ అలీ (18) సైకిల్ మీద వెళ్తుండగా అతడిని ఓ బస్సు ఢీకొంది. అలీ రోడ్డు మీద పడి అతడికి రక్తస్రావం అవుతోంది. ఆ సమయానికి అక్కడ చాలామందే ఉన్నారు గానీ, ఏ ఒక్కరూ అతడి ప్రాణాలను కాపాడాలని గానీ, ఆస్పత్రికి తీసుకెళ్లాలని గానీ అనుకోలేదు. ఎట్టకేలకు ఎవరో స్పందించి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ అలీ మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటే రక్తస్రావాన్ని నియంత్రించి అతడి ప్రాణాలు కాపాడగలిగేవాళ్లమని వైద్యులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles