దేశ అర్థికవ్యవస్థ ముందు మూడు సవాళ్లు: అరుణ్ జైట్లీ three major challenges for emerging economies says FM

Three major challenges for emerging economies says fm

PM modi, narendra modi, arun jaitley, finance minister, nda government, budget 2017-18, Union Budget 2017, financial year budget, congress, mallikarjun kharge, parliament, three major challenges

There are three major challenges for emerging economies, said Finance minister Arun Jaitley during Union Budget 2017 presentation.

దేశ అర్థికవ్యవస్థ ముందు మూడు సవాళ్లు: అరుణ్ జైట్లీ

Posted: 02/01/2017 11:44 AM IST
Three major challenges for emerging economies says fm

2017-18 వార్షిక బడ్జెట్ సు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగిస్తూ..ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఆర్థిక వ్యవస్థ ముందు మూడు సవాళ్లు ఉన్నాయని అరుణ్‌జైట్లీ అన్నారు. అమెరికా ఫెడరల్‌ వడ్డీరేట్లు పెంపు, ముడిచమురు ధరల పెరుగుదల, రక్షణాత్మక వైఖరివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారాయని ఆయన అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని, విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగాయని అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు.

మోదీ హయాంలో దేశ వృద్ధిరేటు పెరిగిందని, వృద్ధిరేటు, యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని అరుణ్‌జైట్లీ చెప్పారు. తాము పాలనలో పారధర్శకతను తీసుకువస్తున్నామని చెప్పుకోచ్చారు. పరిపాలనలో సమూల మార్పులు తేవడమే తమ లక్ష్యమని అన్నారు. పారదర్శమైన పాలనను తీసుకురావడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గించామన్నారు. తొమ్మిది శాతంగా వున్న ద్రవ్యోల్భణాన్ని ఆరుకు తీసుకువచ్చామని అన్నారు. దేశం నుంచి నల్లధనాన్ని పారద్రోలేందుకు పాత పెద్ద నోట్ల రద్దుతో పాటు పలు చర్యలు తీసుకున్నామని ప్రకటించారు.

ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాల నేపథ్యంలో బ్యాంకుల దగ్గర విపరీతంగా నిధులు ఉన్నాయన్నారు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. వడ్డీరేట్లు తగ్గడం వల్ల పారిశ్రామిక రంగం పుంజుకుంటుందన్నారు. రైతులు, వ్యవసాయ, గృహ రుణాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ముద్ర యోజన కింద ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు తగ్గుతుందని తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 7.2 శాతం వృద్ధిరేటు ఉంటుందని ఐఎంఎఫ్‌ చెప్పిందని తెలియజేశారు. దీంతో ముద్ర రుణాలను మరింత పెంచేందుకు నిధులను రెట్టింపు చేస్తామని చెప్పారు.

 పబ్లిక్‌ సర్వీస్‌లో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. పన్నుల్లో సంస్కరణలు తమ లక్ష్యమని చెప్పారు. ఫలితంగా ఐదేళ్లలో వ్యక్తుల ఆదాయం రెట్టింపవుతుందని జైట్లీ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు, పథకాలు పేదలకు చేరటం, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్‌ ఎకానమీ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను జియో ట్యాగింగ్ చేస్తామని  జైట్లీ పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులను శాటిలైట్లతో పర్యవేక్షిస్తామన్నారు.

అలాగే ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత బడ్జెట్ లో రూ.38వేల కోట్లు కేటాయించగా ప్రస్తుతం 48వేల కోట్లకు పెంచామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.3లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, 2019 నాటికి 50వేల గ్రామ పంచాయతీల్లో పేదరికాన్ని అరికడతామని జైట్లీ పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన పథకాలను పంచాయతీలే పర్యవేక్షించవచ్చన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 5లక్షల పంట కుంటలు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది మరో 5లక్షల పంటకుంటల తవ్వకం జరుపుతామని జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles