సెక్స్ రొంపిలోకి 8వ తరగతి విద్యార్థి, సహచరుల బ్లాక్ మెయిల్ School Mates Force MInor Boy Into Sex; Blackmail For Money

School mates force class 8 boy into sex blackmail for money

Chadharghat police, case against four students, Mesco Grade School, Old Malakpet, blackmail, class 8 student, unnatural sex, pictures, videos, Jamal Colony, Nalgonda Cross Roads, crime

Chadharghat police on Monday booked a case against four students of Mesco Grade School situated at Old Malakpet for blackmailing a class 8 student after forcing him into unnatural sex

సెక్స్ రొంపిలోకి 8వ తరగతి విద్యార్థి, సహచరుల బ్లాక్ మెయిల్

Posted: 01/30/2017 03:41 PM IST
School mates force class 8 boy into sex blackmail for money

నేటి బాలలు రేపటి పౌరులు అన్న మాటలో అర్థం ఏంటో కూడా తెలియని బాలురు. అయితే తమ తవసరాలకు డబ్బుకోసం దారుణానికి ఒడిగట్టారు. స్నేహితులే కదా అని వారు చెప్పినట్టలా చేసిన 8వ తరగతి విద్యార్థికి చిట్టచివరి వారి చేతిలో చిక్కుకుపోయాడు. అగిడినప్పుడల్లా డబ్బు, దస్కాం ఇవ్వకపోతే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. తన కొడుకులో వస్తున్న మార్పులను సునితంగా గమనించిన తండ్రి ఎట్టకేలకు విషయాన్ని తెలుసుకుని బాలల హక్కు కమీషన్ ను అశ్రయించాడు.

కాలం మారుతుంది.. రేపటి తరం కూడా శరవేగంగా మారుతుంది. అందివచ్చిన సాంకేతిక విప్లవాన్ని అయినదానికి, కానీదానికి వినియోగించే తల్లిదండ్రులను చూస్తూ పిల్లల్లో కూడా పెను మార్పులను తీసుకువస్తుంది. తెల్లవారగానే దేవుడి నామస్మరణ చేస్తూ నిద్ర నుంచి లేచే గత తరం నుంచి నిద్ర లేస్తూనే సెల్ ఫోన్ లో సోషల్ మీడియాను ఫాలో అవ్వతున్న నేటి తరానికి ఎంత మార్పు వుందో కానీ.. రేపటి తరం మాత్రం మరింత వేగంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.

హైదారబాద్ ఓల్ట్ మలక్ పేట్ లోని జమాల్ కాలనీకి చెందిన 8వ తరగతి విద్యార్థి బ్లాక్ మెయిల్ చేసిన కేసులో స్థానికంగా వున్న మెస్కో గ్రేడ్ స్కూల్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులపై చాదర్ ఘాట్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 8వ తరగతి విద్యార్థిని బలవంతంగా నగ్నంగా మార్చడంతో పాటు తన సహచరుడితో సెక్స్ లో పాల్గోనేలా బలవంతపెట్టారు తోటి విద్యార్థులు. అతడు నగ్నంగా మారిన తరుణంలో అతనికి తెలియకుండా ఫోటోలను, వీడియోలను తీశారు.

ఆ తరువాత అడిగినప్పుడల్లా తమకు డబ్బు ఇవ్వాలని, లేని పక్షంలో తమ వద్దనున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదింపులకు గురిచేశారు. దీంతో పలుమార్లు ఇంట్లో తెలియకుండా డబ్బులను తీసుకువెళ్లిన విద్యార్థి.. మానసికంగా వేదనకు లోనయ్యాడు. తన కొడుకులో వస్తున్న మార్పులను గమనించిన తండ్రి.. తీరా విషయం తెలుసుకున్నాడు. దీంతో బాలల హక్కుల కమీషన్ ను కలిశాడు. వారి సూచన మేరకు చాధర్ ఘాట్ పీఎస్ లో కేసు నమోదు చేశాడు. అయితే నేరానికి పాల్పడిన మైనర్ విద్యార్థులను మాత్రం ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles