అడవికి రాజులు. మృగాలలో రారాజులుగా వెలుగొందుతున్న సింహాన్ని చూడాటానికి రెండు కనులు కూడా చాలవు. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ జెనిలియాకు చూపించినట్లుగా.. ఒక్కసారిగా మనముందుకు మృగరాజు వస్తే.. దాన్ని చూడగానే మన గుండె అగినంత పని అవుతుంది. కానీ మన ప్రాణాలకు ఢోకా లేదని తెలిసిన తరువాత వాటిని చూడాలంటే.. మాత్రం ఎవరికి ఇష్టం వుండదు. ఠీవిగా నడుస్తూ వెళ్ళే సింహంలో కనిపించే రాజసాన్ని చూసి తీరవలసిందే.
దాని ఆకారం, సన్నని నడుము ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక సింహాన్ని చూసినపుడే ఎంతో ఆనందం కలుగుతంది. అయితే సింహాల గుంపు మనం వెళ్లే దారిలో ఉంటే.. హమ్మో అంటూ కేకేస్తాం. సరిగ్గా అలాగే జరిగింది. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సింహాల గుంపు రోడ్డుపై బైఠాయించాయి, ఆకటితో వున్న మృగరాజులు అప్పుడే ఒక అడవి దున్నను వేటాడి రోడ్డుపైనే తమ ఆహారాన్ని తిన్నాయి. ఇక వాటిని చూసినపుడు కలిగే సంతోషం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. బెడ్ఫోర్డ్వ్యూకు చెందిన ఓ వృద్ధ జంట ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు
18 సింహాలు రోడ్డుపైన ఓ దున్నపోతును తింటూండటాన్ని షౌన్ రైట్ (60), ఆయన భార్య రోజ్ మేరీ చూశారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషించారు. వెంటనే ఆ సన్నివేశాలను చిత్రీకరించారు. క్రూగర్ నేషనల్ పార్క్‌కు ఆ జంట ఏటా వస్తూంటుంది. కానీ ఈ ఏడాది ఇంత అపురూపమైన సంఘటన జరుగుతుందని వారు ఊహించలేదు. దీనిని తాము ఎప్పటికీ మర్చిపోయేది లేదంటున్నారు. అదే సమయంలో ఆ రోడ్డుపైకి వచ్చిన కార్లు దూరంగా ఆగిపోయాయని వారు చెప్పారు. మృగరాజులను దాటుకుని వెళ్ళే సాహసం ఎవరూ చేయలేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more