సర్ధుకుపొతారా.. సర్థేసుకుని పొతారా.. తేల్చుకోండీ..! BJP central leadership calls truce between BSY and Eshwarappa

Quit if you can t fall in line amit shah to warring karnataka leaders

bjp national president, amit shah, bjp, cold war, sangolli rayanna brigade, Yeddyurappa, Eshwarappa, Bengaluru, Karnataka, politics

The peace talks mediated by BJP national president Amit Shah to resolve the differences between Karnataka party president BS Yeddyurappa and senior party leader KS Eshwarappa have borne fruit.

సర్ధుకుపొతారా.. సర్థేసుకుని పొతారా.. తేల్చుకోండీ..!

Posted: 01/28/2017 02:23 PM IST
Quit if you can t fall in line amit shah to warring karnataka leaders

కర్ణాటక బీజేపీ అగ్ర నేతలు మధ్య రాజుకున్న వివాదాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చాకచక్యంగా పరిష్కరించారు. దీంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప, పార్టీ సీనియర్ నేత కేఎస్‌ ఈశ్వరప్ప విభేదాలు పక్కనబెట్టి రాజీకి అంగీకరించారు. ఇందుకు అమిత్ షా వేసిన పాచిక బాగానే పనిచేసింది. పార్టీకి చెందిన ఇద్దరు నేతలను హస్తినకు పిలిపించిన అమిత్ షా.. ఇద్దరినీ కాస్త గట్టిగానే మందిలించారు. సర్థుకుపోతారా..? లేక పార్టీ నుంచి సర్థుకుని పోతారా.. అన్న విషయమై తేల్చుకోవాలని కుండబద్దలు కోట్టినట్లు చెప్పడంతో.. గత్యంతరం లేని నేతలు సర్థుకుపోయేందుకు అంగీకరించారు.

అసలు ఇద్దరు నేతల మధ్య యుధ్దవాతావరణం ఎందుకు వచ్చిందంటే..? కన్నడ పోరాటయోధుడు సంగోలి రాయన్న సంస్మరణార్థం నిర్వహించనున్న కార్యక్రమాలు పార్టీ వేదికలో ఉమ్మడిగా నిర్వహించేందుకు అంగీకరించారు. సంగోలి రాయన్న సంస్మరణ కార్యక్రమాలు సంగోలీ రాయన్న బ్రిగేడ్‌ పేరిట పార్టీకి అతీతంగా కర్ణాటక శాసనమండలి ప్రతిపక్ష నేత కేఎస్‌ ఈశ్వరప్ప ప్రత్యేకంగా నిర్వహించేందుకు సిద్ధపడటంతో పార్టీలో ముసలం తలెత్తింది. ఈ కార్యక్రమాలను రాష్ట్ర బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప వ్యతిరేకించారు. దీంతో ఇరువురు నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేచింది.

దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు షా రంగంలోకి దిగి ఇరువురు నేతలకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయకుంటే.. పార్టీని వీడి వెళ్లిపోవచ్చునంటూ ఇరువురు నేతలకు ఆయన ఘాటుగా చెప్పడంతో ఇద్దరు దిగొచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో యడ్యూరప్ప, ఈశ్వరప్ప ఇద్దరూ పాల్గొంటారని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit shah  bjp  cold war  sangolli rayanna brigade  Yeddyurappa  Eshwarappa  Bengaluru  Karnataka  politics  

Other Articles